iDreamPost
android-app
ios-app

రాయణం క్రేజ్ ఇలా వాడుతున్నారు

  • Published Feb 28, 2021 | 5:13 AM Updated Updated Feb 28, 2021 | 5:13 AM
రాయణం క్రేజ్ ఇలా వాడుతున్నారు

ఏదైనా పరభాషా నటుడికి ఇక్కడో బ్లాక్ బస్టర్ పడి పేరు వస్తే చాలు ఒరిజినల్ లాంగ్వేజ్ లో అతను గతంలో చేసిన హిట్లు ఫ్లాపులు అన్నీ కలిపి డబ్బింగ్ రూపంలో ప్రేక్షకుల మీదకు వదలడం ఎప్పటి నుంచో జరుగుతున్నదే. అప్పట్లో అపరిచితుడు వచ్చాక నెలకో విక్రమ్ తమిళ మూవీ అనువదించి మరీ రిలీజ్ చేసేవారు. ఉపేంద్ర హయాంలోనూ అంతే. ఆఖరికి రవితేజ కృష్ణ రీమేక్ ని అతను కన్నడలో చేసుకుంటే దాన్ని మళ్ళీ తెలుగులోకి తీసుకొచ్చిన ఘనత మనది. ధనుష్ రఘువరన్ బిటెక్ సూపర్ హిట్ కాగానే ముక్కుమొహం తెలియని అతని సినిమాలు ఎన్ని వదిలారో లెక్క బెట్టడం కష్టం. ఇప్పుడు మళ్ళీ ఈ ట్రెండ్ స్టార్ట్ అయ్యింది.

ఉప్పెనలో రాయణం క్యారెక్టర్ లో విశ్వరూపం చూపించిన విజయ్ సేతుపతి హీరో హీరోయిన్ లతో సమానంగా ఇంకా చెప్పాలంటే ఒక మెట్టు ఎక్కువే పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ క్రేజ్ ని వాడుకుని విజయ్ సేతుపతి పాత ఆరవ సినిమాలను బూజు దులిపి బయటికి తీస్తున్నారు. అందులో భాగంగా మూడేళ్ళ క్రితం 2018లో వచ్చిన ‘జుంగా’ని ‘విక్రమార్కుడు’ పేరుతో డబ్బింగ్ చేసి ఈ శుక్రవారం రిలీజ్ చేయబోతున్నారు.ఇందులో సాయేషా సైగల్ హీరోయిన్. అక్కడ ఇదేమి పెద్దగా ఆడిన బొమ్మ కాదు. సోసో ఫలితాన్నే దక్కించుకుంది. ఇక్కడ రవితేజ టైటిల్ ని పెట్టి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఇదే విజయ్ సేతుపతి, మన మెగా కాంపౌండ్ హీరోయిన్ నీహారిక కాంబోలో వచ్చిన ‘ఓరు నల్ల నాల్ పాత్రు సోల్రేన్’ ని ఓ మంచి రోజు చూసి చెప్తా పేరుతో తీసుకొస్తున్నారు. ఇదీ మార్చి 19నే రాబోతోంది. పోస్టర్స్ లో నీహారికను కూడా బాగా హై లైట్ చేస్తున్నారు. ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ సినిమా నిజానికి అక్కడ డిజాస్టర్. ఎంతో కొంత వసూళ్లు వస్తాయనే నమ్మకంతో నిర్మాతలు ధైర్యం చేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే  ఎప్పుడో 2014లో వచ్చిన కెజిఎఫ్ హీరో యాష్ ‘గజకేసరి’ని ఇప్పుడు ఇక్కడ డబ్బింగ్ చేశారు. ఇంతా చేసి ఇది మగధీర ఛాయల్లో  సాగే సినిమా కావడం గమనార్హం. సో ఓ హిట్టు తెచ్చే క్రేజ్ ని ప్రొడ్యూసర్లు ఇలా వాడుకుంటున్నారు.