Idream media
Idream media
కరోనా మహమ్మరి విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా కొత్త కేసులు నమోదయ్యాయి. ఏపీలో ఇప్పటి వరకు 13 కేసులు నమోదు కాగా, తాజాగా మరో ముగ్గురికి పాజిటివ్ అని తేలింది. దీంతో ఏపీలో కరోనా కేసులు సంఖ్య 16కు చేరింది.
కొత్తగా నమోదైన మూడు కే సుల్లో రెండు ప్రకాశం జిల్లాలో నమోదయ్యాయి. చీరాలకు చెందిన భార్యభర్తలు ఇటీవల ఉత్తర భారత దేశం పర్యటనకు వెళ్లారు. వచ్చిన తర్వాత వారు దగ్గు, జలుబుతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో వారిద్దరిని ఒంగోలులోని రిమ్స్‌కు తరలించారు. పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్ అని తేలింది. ఇరువురిని రిమ్స్‌లో ఉంచి వైద్య సేవలు అందిస్తున్నారు.
మరో కేసు రాయలసీమలోని కర్నూలు జిల్లాలో నమోదైందని ఆ జిల్లా కలెక్టర్ తెలిపారు. రాష్ట్రంలో తొలి కేసు నెల్లూరు జిల్లాలో నమోదు కాగా సదరు వ్యక్తి కోలుకున్నారు. మొత్తం మీద ఏపీలో 16 పాజిటివ్ కేసులు నమోదు కాగా కోలుకున్న వ్యక్తి మినహాయిస్తే ఆ సంఖ్య 15కు చేరుకుంది. తెలంగాణలో ఈ రోజు శుక్రవారం తొలి మరణం నమోదవడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 65కు చే రింది.