బిజీగా ఉండటం వలన ఈ ఆర్టికల్ రాయడం లేటయింది..
ఈరోజు ఆదివారం అవడం వలన తీరిగ్గా రాశాను.😊
“బిగ్ బాస్4 పైన నాకొక అనుమానం” అని పొయినవారం 12వతేదీ నేను రాసిన ఆర్టికల్ చూసి అదేరోజు రాత్రి బిగ్ బాస్ టీం నుండి ఒక ముఖ్యమైన వ్యక్తి నాకు కాల్ చేశారు.
ఆయన పేరు రివీల్ చెయ్యడం కరెక్ట్ కాదు కాబట్టి చెప్పలేను.
నేను రాసిన ఆ ఆర్టికల్ మీద వివరణ ఇవ్వడానికే కాల్ చేశారు ఆయన.
ఆరోజు హౌజ్ లోకి ఎంటర్ అయ్యాక మోనాల్ ని చూసి అభిజిత్ అలా రియక్షన్ ఇవ్వకుండా ఉండటానికి కారణం చెప్పారు.
ఆయన నాతో ఫోన్ లో చెప్పిన విషయం ఏంటంటే…
“మీరు ఎక్స్ ప్రెస్ చేసిన అనుమానం కరెక్ట్ అండి..
కానీ అక్కడ మా కారణాలు మాకున్నాయ్…
కానీ ఆ కారణాన్ని మేము ప్రతీ మనిషికీ పేరు పేరునా చెప్పలేం…
ఇప్పుడు మీరు పోస్ట్ పెట్టారు కాబట్టి నాకెందుకో మీతో చెప్పాలనిపించి చెప్తున్నాను.
అసలు ఆరోజు జరిగిందేంటంటే…
మామూలుగా ఇంట్రడక్షన్ ఎపిసోడ్ లో నాగార్జున గారితో స్టేజ్ మీద మాట్లాడి అక్కడనుండి హౌజ్ లోపలికి వెళ్తున్నప్పుడు ఎంట్రెన్స్ లో ప్రతీ పార్టిసిపెంట్ ని ఫోటోగ్రాఫర్స్ స్టిల్స్ తీస్తారు..
అలా అభిజిత్ హౌజ్ లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడు అక్కడున్న ఫోటోగ్రాఫర్స్ అంతక ముందే హౌజ్ లోపలికి ఎంటర్ అయిన మోనాల్ ఫోటోస్ చూస్తూ ఆమె గురించి మాట్లాడుతున్నారంట..
మొత్తానికి వాళ్ళ డిస్కషన్ ద్వారా ఎంట్రెన్స్ లోనే ఆల్రెడీ హౌజ్ లో మోనాల్ ఉన్నట్టు అభిజిత్ కి అర్థమయిపోయింది.
అలా సస్పెన్స్ అక్కడే రివీల్ అయ్యేసరికి మనోడు ఆ షాక్ ఎక్స్ ప్రెషన్ ని ఎంట్రెన్స్ దగ్గరే ఇచ్చేశాడు.
ఇంక లోపలికి వెళ్ళాక మోనాల్ దగ్గర అభిజిత్ ఆ షాకింగ్ ఎక్స్ ప్రెషన్ ఇవ్వలేకపోయాడు.
ఆ షార్ట్ పీరియడ్ లో బిగ్ బాస్ టీం కి కూడా మ్యానేజ్ చేసేంత టైం దొరకలేదు.
సో…అలా ముందుగానే సస్పెన్స్ రివీల్ అవ్వడం వలన అభిజిత్ & మోనాల్ ల ఎపిసోడ్ బిట్ ఎండింగ్ అలా జరిగింది.
నా పోస్ట్ లో వ్యక్తీకరించిన అనుమానానికి ఆన్సర్ అలా దొరికింది..😊
అనుమానం మీ దగ్గర లేవనెత్తినప్పుడు సమాధానం దొరికినప్పుడు కూడా మీకు చెప్పాలిగా..చెప్పేశా..😍
…………………..
నేను ఆరోజు రాసిన “బిగ్ బాస్ 4 పైన నాకొక అనుమానం” అనే ఆర్టికల్ కోసం ఈ కింది లింక్ క్లిక్ చెయ్యండి..
Link Here @ https://www.idreampost.com/te/news/movies/i-have-a-small-doubt-in-bigg-boss-tnr