Idream media
Idream media
పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాలలో చెలరేగిన ఆగ్రహ జ్వాలలు ఇంకా చల్లారలేదు. గువాహతిలో కర్ఫ్యూ ఉన్నప్పటికి ప్రజలు రోడ్లపైకొచ్చి నిరసనలు తెలియజేస్తున్నారు. పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా చెలరేగిన ఆందోళనల నేపథ్యంలో అసోం ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలపై మరో 48 గంటలు ఆంక్షలు పెంచింది.
మరోవైపు అల్లర్ల నేపథ్యంలో గువాహటి పోలీస్ కమిషనర్ పై బదిలీ వేటు వేసింది. ఈయనతో పాటు శాంతిభద్రతల పర్యవేక్షణ ఉన్నతాధికారిని కూడా బదిలీ చేసింది. వీరితో పాటు అదనపు డిజిపి, ఐ జి స్థాయి అధికారిని కూడా బదిలీ చేసింది. కర్ఫ్యూ ఉన్నా ప్రజలు బయటికొచ్చి ఆందోళనలు చేయడంతో ప్రభుత్వం అధికారులను ఈ విధంగా బదిలీ చేసింది.
మరోవైపు అస్సోం ఆందోళనలతో అట్టుడుకిపోతుంది. భారీగా బలగాలు మోహరించినా ప్రజలు లెక్కచేయకుండా బయటికొచ్చి తమ ఆందోళనలు కొనసాగించారు. వాహనాలకు నిప్పంటించారు. అడ్డొచ్చిన పోలీసులపై కూడా దాడి చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు కాల్పులు జరపగా ముగ్గురు చనిపోయారు. 11 మందికి తూటా గాయాలయ్యాయి. త్రిపుర లోను ఆందోళనలు కొనసాగుతున్నాయి.