iDreamPost
iDreamPost
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందేమో కానీ అఖిల్ ఇప్పుడు తన దృష్టి మొత్తం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేస్తున్న ఏజెంట్ మీదే పెట్టాడు. మొదటి సారి కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్ చేస్తున్న ఈ అక్కినేని వారసుడితో పాటు అభిమానులకు కూడా దీని మీద చాలా అంచనాలు ఉన్నాయి. సురేందర్ రెడ్డికి సైరా తర్వాత ఏడాది గ్యాప్ వచ్చింది. అంతకష్టపడి రెండేళ్లు దానికోసం త్యాగం చేస్తే బాహుబలి ఫలితం బదులు ఎబోవ్ యావరేజ్ అనిపించుకోవడం ఫ్యాన్స్ సైతం జీర్ణించుకోలేకపోయారు. దానికన్నా ముందు చేసిన ధృవ రీమేక్ కావడంతో ఆ సక్సెస్ క్రెడిట్ ని ఎక్కువగా ఎంజాయ్ చేయడనికి లేకుండా పోయింది.
అందుకే తనకు కూడా ఏజెంట్ బ్లాక్ బస్టర్ హిట్ కావడం చాలా అవసరం. ఈ సంగతి కాసేపు పక్కనపెడితే అఖిల్ దీని తర్వాత చేయబోయే సినిమా కోసం దర్శకుడిని ఆల్రెడీ లాక్ చేసుకున్నట్టు ఇన్ సైడ్ టాక్. సున్నితమైన ప్రేమకథలను తెరకెక్కిస్తాడని పేరున్న హను రాఘవపూడికి అఖిల్ ఓ కమిట్ మెంట్ ఇచ్చాడని వినికిడి. ఇంకా అధికారికంగా రాలేదు కానీ ప్రాధమిక చర్చలు జరిగాయని అంటున్నారు. హను ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ తో వైజయంతి బ్యానర్ కోసం ఒక వార్ పీరియాడిక్ మూవీ చేస్తున్నాడు. ఇటీవలి కాలంలో దీని అప్ డేట్స్ రావడం లేదు కానీ వర్క్ అయితే జరుగుతోందని అంటున్నారు.
సో అఖిల్ ప్లానింగ్ చాలా తెలివిగా సాగుతున్నట్టే అనిపిస్తోంది కానీ అంతగా సక్సెస్ ట్రాక్ లేని దర్శకులతో జత కట్టడమే ఆశ్చర్యం కలిగిస్తోంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కి బొమ్మరిల్లు భాస్కర్ ని ప్రకటించినప్పటి నుంచి ఎన్నో అనుమానాలు తలెత్తాయి. దానికి తగ్గట్టే ఆది ఆగుతూ సాగుతూ విడుదల విషయంలో కూడా క్లారిటీ లేకుండా పోతోంది. దానికి తోడు కరోనా లాంటి ట్విస్టులు అదనం. ఆరేళ్ళు దాటుతున్నా గట్టి హిట్టు లేని అఖిల్ కు ఏజెంట్ రూపంలోనే హిట్టు దక్కాలి. నాగార్జున వారసుడిగా చైతు కష్టపడుతున్నప్పటికీ ఇంకా మీడియం రేంజ్ దగ్గరే ఉన్నాడు. మరి అఖిల్ అయినా ఓ నలభై కోట్ల క్లబ్బులోకి ఏ సినిమా తీసుకెళ్తాడేమో చూడాలి