iDreamPost
android-app
ios-app

బన్నీ ఏడాదిన్నర గ్యాప్ కు చెక్

  • Published Jan 11, 2020 | 11:51 AM Updated Updated Jan 11, 2020 | 11:51 AM
బన్నీ ఏడాదిన్నర గ్యాప్ కు చెక్

సంక్రాంతి బరిలో రెండు పుంజులు వచ్చేశాయి. రజనీకాంత్ దర్బార్ డీసెంట్ కలెక్షన్స్ తో ఓపెన్ అయినప్పటికీ టాక్ ప్రభావం చూపుతోంది. వసూళ్లపరంగా మరీ బ్యాడ్ ఫిగర్స్ నమోదు కావనే నమ్మకంతో ఉంది ట్రేడ్. ఈ రోజు సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరుతో రంగంలోకి దిగాడు. ఫస్ట్ డే లెక్కలలో కొత్త రికార్డులు ఖాయమని అభిమానులు ధీమాగా ఉన్నారు. టాక్, రివ్యూస్, రిపోర్ట్స్ సగం డివైడ్ సగం పాజిటివ్ గా ఉన్నప్పటికీ మహేష్ ఛరిష్మా ఈ వారం మొత్తం టికెట్ల అమ్మకాలకు లోటు లేకుండా చేసేలా ఉంది.

ఇది ఆశించిన స్థాయిలో హిట్ అవుతుందా లేదా అని తేలడానికి కొంత టైం పడుతుంది. ఇదిలా ఉండగా రేపు అల్లు అర్జున్ అల వైకుంఠపురములో రాబోతోంది. ఏడాదిన్నర గ్యాప్ తర్వాత వస్తున్న మూవీ కావడంతో ఫ్యాన్స్ కూడా ఎగ్జైటింగ్ గా ఉన్నారు. ఇప్పటికే తమన్ సాంగ్స్ చార్ట్ బస్టర్స్ అయ్యాయి. పబ్లిక్ బాగుందన్న మాట వినిపిస్తే చాలు ఇది కూడా రికార్డుల వేట మొదలుపెడుతుంది.

నా పేరు సూర్య ఫలితానికి డిఫెన్స్ లో పడ్డ బన్నీ సుమారు ఏడాది కాలం కథలు వినడంలోనే గడిపేశాడు. విక్రమ్ కుమార్ తో ప్రాజెక్ట్ సెట్స్ దాకా వెళ్ళబోతూ ఆగిపోయింది. తీరా అతను నానితో గ్యాంగ్ లీడర్ చేసి ఫ్లాప్ అందుకున్నాడు. ఇది చూసాక బన్నీ నిర్ణయం సరైనదేనని అనుకున్నవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అల వైకుంఠపురములో మాములు హిట్ అయితే సరిపోదు. అందులోనూ అల్లు అర్జున్ కు మంచి క్రేజ్ ఉన్న మలయాళంలోనూ ఇదే రోజు రిలీజ్ చేయడం ప్లస్ గా మారుతుంది. ఒకవేళ ఆశించినట్టు రిజల్ట్ వస్తే అభిమానుల ఆనందానికి హద్దులు ఉండవు. త్రివిక్రమ్ మాటల మాయాజాలం కోసం ఫామిలీ ఆడియన్స్ ఆసక్తిగా ఉన్నారు. చూడాలి రేపు బన్నీ-మాటల మాంత్రికుడు చేయబోతున్న మేజిక్ ఎలా ఉండబోతోందో.

Jojobet GirişBetcioivermectin tabletMadridbetMadridbetPusulabetmeritbetCasibom GirişmeritbetpokerklasTophillbetmarsbahis girişJojobet GirişcasibomCasibom GirişMarsbahis GirişHoliganbetbetebetHoliganbetMarsbahis Giriş