iDreamPost
iDreamPost
ఒక వైపు అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగు తుంటే…మరోవైపు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ మాత్రం సభలో నవ్వులు పూయించారు. రైతు రుణ మాఫీ పై చర్చ జరుగుతున్న సందర్భంగా బుగ్గన మాట్లాడారు. రైతులకు తాము ఇచ్చిన హామీ కన్నా ఎక్కువగా ఇస్తున్నామని న్నారు. స్పందించిన చంద్రబాబు నాయుడు తమ ప్రభుత్వ హయాంలో రైతులకు ఏక కాలంలో రుణమాఫీ చేస్తామని అన్నారు. మీలా అధికారం లోకి వచ్చాక ఏక కాలం లో ఐదు విడతలుగా ఇస్తామని రైతులను మోసం చేస్తున్నారని అన్నారు. దీంతో మంత్రి బుగ్గన టక్కున లేచి బాబు వస్తె బ్యాంక్ ల నుండి బంగారం రైతుల బీరువాలో కి వస్తుందని, కాదు..కాదు ఇళ్లకు వస్తుందని చెప్పిన రైతుల బంగారం, వేలం పాటల్లో వెళ్లి పోయాయన్నారు. దీంతో ఆగ కుండా 2014 ఎన్నికల సందర్భంగా చంద్రబాబు అధికారం లోకి వస్తె మన బంగారం మన ఇంటికి నడిచి వస్తుంది, చంద్రన్నకే మన ఓటు అంటూ ఏబీఎన్ ఛానెల్ లో ప్రసారమైన ఒక యాడ్ ను ఈ సందర్భంగా ప్రసారం చేశారు. దీంతో అందరూ కాసేపు నవ్వుకున్నారు.
అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ బుగ్గన నువ్వు చాలా తెలివిగా మాట్లాడుతానని, తికమక లెక్కలతో ప్రజలను మభ్య పెడుతున్నారని అన్నారు. ఇందుకు స్పందించిన మంత్రి బుగ్గన టక్కున మళ్లీ హాస్యం పండించారు. అప్పట్లో రోశయ్య ను కూడా ఇలాగే తెలివిగా మాట్లాడుతూ సభను తప్పు దోవ పట్టిస్తున్నారని అని చంద్రబాబు అనేవారని, దానికి రోశయ్య ఏమ్మాన్నారో ఈ సందర్భంగా బుగ్గన గుర్తు చేశారు. బాబు నీ అంత తెలివి ఉంటే మా నాయకుడిని వెన్నుపోటు పొడిచే వాడినని అని రోశయ్య అన్న మాటలను బుగ్గన గుర్తు చేయడం తో సభలో అందరూ గొల్లున నవ్వారు. చివరగా సీఎం జగన్ కల్పించు కుంటు కుక్కతోక వంకర అనే మాట అన్న సమేత కచ్చితంగా చంద్రబాబు కి వర్తిస్తుందని చలోక్తి విసిరారు. దీంతో స్పందించిన బాబు ప్రజలు మీతోక పట్టునే వచ్చారని, త్వరలోనే మునిగి పోతున్నామని త్వరలోనే వారికి తెలుస్తుందని సమాధానం ఇచ్చారు.