తరతరాలుగా సమాజంలో వేళ్లూనుకుపోయి మన జీవన విధానంలో ఒక భాగంగా కలిసిపోయిన అవినీతిని జగన్ ప్రక్షాళన చేస్తానని ఎన్నికల ముందు చెప్పుకోచ్చారు, ముఖ్యమంత్రి అయిన తరువాత వై.యస్ జగన్ అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్ కోసం అనేక చర్యలు చేపడుతూ వస్తున్నారు, ఈ సమయంలోనే అనేక మంది ఇది సాధ్యం అయ్యే పనేనా! అంటూ పెదవి విరిచారు, కానీ తాజాగా జాతీయ స్థాయిలో జరిగిన ఒక సర్వే ప్రకారం అవినీతిలో కూరుకుపొయిన రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ ఊసేలేదు.
గత చంద్రబాబు ప్రభుత్వంలో అవినీతి తాండవం
5 ఏళ్ళ గత ప్రభుత్వం హయాంలో విడుదల అయిన జాతీయ సంస్థల సర్వే రిపోర్టుల ప్రకారం అవినీతిలో మొదటి మూడు స్థానలలో ఆంధ్రప్రదేశ్ ఉండటం మనం చూస్తు వచ్చాము, (సి.యం.యస్) సర్వే సంస్థ ప్రజా సేవల్లో అవినీతి పెరిగిపోయిందని దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అవినీతిలో 2వ స్థానంలో ఉందని తమ నివేదికలో చెప్పుకోచ్చింది. ఇంకొక ప్రముఖ సంస్థ (నేష్నల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్ రీసర్చ్) వాళ్ళు ఏకంగా అవినీతిలో ఆంధ్రప్రదేశ్ కి దేశంలోనే మొదటి స్థానం ఇస్తూ ఆంధ్రప్రదేశ్ అత్యంత అవీనీతి రాష్ట్రమని తమ నివేదికలో చెప్పుకొచ్చారు.
జగన్ ప్రభుత్వంతో మార్పుకు బీజం
ముఖ్యమంత్రి జగన్ చెబుతూ వస్తున్న అవీనీతిరహిత పాలన, దానికోసం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని తాజాగా ఒక సర్వే విడుదల చేసిన ఫలితాల ద్వారా తెలుస్తుంది. ఇండియన్ కరప్షన్ సర్వే వారు దేశం మొత్తం మీద సర్వే చెసి మొత్తం 1.90 లక్షల సాంపిల్స్ తీసుకుని అవీనితిలో కూరుకుపొయిన రాష్ట్రాల జాబితాను తయారు చేశారు, రిజిస్ట్రేషన్లు , పొలీసు స్టేషన్లు, మునిసిపాలిటీలు ఇతర ప్రభుత్వ కార్యాలయాలో పనుల కోసం లంచాలు అడుగుతూ అవినీతికి పాల్పడుతున్న మొదటి 8 రాష్ట్రల జాభితాను తయ్యారు చేశారు ఇందులో 78% తో రాజస్థాన్ రాష్ట్రం మొదటి స్థానంలో ఉండగా, 67% తో సాటి తెలుగు రాష్ట్రం అయిన తెలంగాణ 5వ స్థానంలో ఉంది. ఇంక ఆ తర్వాత స్థానాలో బీహార్ , జార్ఖండ్ , ఉత్తరప్రదేశ్, పంజాబ్, కర్నాటక , తమిళనాడు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ మొదటి 8స్థానాలలో లేదు.
గత చంద్రబాబు పాలనలో అవినీతిలో దేశంలోనే మొదటి స్థానం సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్, జగన్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కాక ఏకంగా అవినీతి రాష్ట్రాల జాబితాలోనే స్థానం లేకపోవడం తెలుగు ప్రజలకు ఎంతో గర్వకారణం, ఒక పాలకుడు నిజంగా మేలు చేయాలని పరిపాలన సాగీస్తే అసాధ్యాలు కూడా సుసాధ్యం అవుతాయనటానికి ఇది తాజా ఉదాహరణ అంటూ సామాజిక వేత్తలు చెబుతున్న మాట , ఈ సందర్భంలో ముఖ్యమంత్రి జగన్ కుర్చీలో కూర్చున్న్ ఆరు నెలల్లో సాధించిన ఈ విజయం ఆసమాన్యమైన విజయంగా భావిస్తునట్టు విశ్లేషకుల అభిప్రాయం. ఏది ఏమైనా జగన్ పాలనలో ఇది ఒక మైలురాయిగా చెప్పవచ్చు.