ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో రైతన్నలకు ఉచితంగా వ్యవసాయ బోర్లు వేసేందుకు అవసరమైన చర్యలను వైఎస్సార్ సర్కార్ చేపట్టింది. ఎన్నికల మేనిఫెస్టో లో ఇచ్చిన హామీ మేరకు 200 రిగ్గులు కొనుగోలు చేసేందుకు మంగళవారం ఆర్ధిక శాఖ అనుమతులు మంజూరు చేసింది. 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఒక్కొక్కటి చొప్పున 200 రిగ్గులాలు కొనుగోలు చేయనున్నారు. అవసరమైన రైతులకు ఈ రిగ్గుల ద్వారా ప్రభుత్వమే ఉచితంగా బోర్లు వేస్తుంది. రాయలసీమ, నెలూరు, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఉభయగోదావరి, కృష్ణ, గుంటూరు జిల్లాలోని మెట్ట ప్రాంతాలలో భూగర్భ జలాలపై ఆధారపడి రైతులు వ్యవసాయం చేస్తున్నారు. ఈ క్రమంలో నీటి కోసం రైతన్నలు పదుల సంఖ్యలో బోర్లు వేసి అప్పులపాలవుతున్నారు. ప్రజాసంకల్ప పాదయాత్రలో రైతన్న కష్ఠాలు తెలుసుకున్న సీఎం జగన్ నవరత్నాల పథకాల్లో ఈ హామీ ఇచ్చారు. ‘వైస్సార్ రైతు భరోసా’ పధకం కింద బోర్లు వేయనున్నారు.