iDreamPost
android-app
ios-app

వియ్యంకులు కాబోతున్న బోండా ఉమ,ఏవీ సుబ్బారెడ్డి

వియ్యంకులు కాబోతున్న  బోండా ఉమ,ఏవీ సుబ్బారెడ్డి

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అదేమంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు పెట్టింది పేరైన కృష్ణా జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే, టీడీపీ కీలక నేత బోండా ఉమామహేశ్వరరావు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన టీడీపీ నేత, విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్‌ ఏవీ సుబ్బారెడ్డి వియ్యంకులు కానున్నారని తెలుస్తోంది. ఒక రకంగా కృష్ణా జిల్లాకు కర్నూలు జిల్లాకు బంధుత్వం బోండా ఉమ తనయుడు బోండా సిద్ధార్థ్‌, ఏవీ సుబ్బారెడ్డి కుమార్తె ఏవీ జస్విత రెడ్డిని పెళ్లి చేసుకోనున్నారు. మార్చి 27న హైదరాబాదులోని ఫలక్ నుమా ప్యాలెస్ నిశ్చితార్థం జరగనుంది.

అమెరికాలో కలిసి చదువుకున్న సిద్ధార్థ్‌, జస్విత ఆ సమయంలోనే ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. విషయం పెద్దవాళ్ళకు చెప్పడంతో వారు కూడా ఒప్పుకున్నారని అందుకే ఇద్దరికీ వివాహం చేసేందుకు ముందుకు వచ్చారని చెబుతున్నారు. ఇద్దరూ ప్రస్తుతం టీడీపీ తరపున చురుగ్గా రాజకీయాల్లో పాల్గొంటున్నారు. బోండా ఉమాకి ఇద్దరు కుమారులు కాగా అందులో సిద్దార్థ్ పెద్దవాడు. ఇక రెండో కుమారుడు రవితేజ సైతం తండ్రి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటూ ఉంటారు.

ఇక ఏవీ సుబ్బారెడ్డికి ముగ్గురు కుమార్తెలు కాగా అందులో జశ్వంతి అంటే అందరి కంటే చిన్న కుమార్తె రాజకీయాల్లో చాలా యాక్టిివ్ గా ఉంటూ వస్తున్నారు. భూమా నాగిరెడ్డి దంపతులకు చాలా సన్నిహితంగా మెలుగుతూ వచ్చిన ఏవీ సుబ్బారెడ్డి, నాగిరెడ్డి మరణానంతరం భూమా కుటుంబానికి దూరమయ్యారు. చంద్రబాబు ఆయనను విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ గా కూడా నియమించారు. అయితే భూమా కుటుంబం నుంచి పూర్తిగా దూరమైన క్రమంలో ఏవీ జస్వంతి రెడ్డి రాజకీయాల్లో బాగా యాక్టిివ్ పార్ట్ తీసుకున్నారు. ఆమె వచ్చే ఎన్నికల్లో టికెట్ కూడా ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. జస్విత మాత్రం ఒకే ఒకసారి మీడియా ముందుకు వచ్చారు. మొత్తం మీద ఈ వియ్యం మాత్రం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయింది.