ఓ అంధురాలు చిత్తూరు జిల్లా పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు వద్దకు వచ్చారు. అన్నా నాకు రెండు కళ్లు లేవు. లోకాన్ని చూడలేను. నీ మాటలు విని, నీకు రెండు మాటలు చెబుదామని వచ్చా అని చంద్రబాబుతో చిత్తూరు జిల్లా నడింపల్లెకు చెందిన వృద్ధురాలు పాల్గొడి నాగమ్మ పేర్కొంది. దీంతో బాబు కళ్లలో నీళ్లు తిరిగాయి.
ఇకపై తాను కార్యకర్తల మాట వింటానని, మీ బాగోగులు పట్టించుకుంటానని బాబు భావోద్వేగంగా సమావేశంలో చెప్పిన విషయం తెలిసిందే. బహుశా ఓ అంధురాలు సమావేశానికి వచ్చి నీతో మాట్లాడాలని చెప్పడం, అధికారంలో ఉంటే బాబు ఎవరినీ పట్టించుకోరనే విమర్శలు బలంగా ఉన్న నేపథ్యంలో…ఆ వృద్ధురాలు మా నాయకుడి కళ్లు తెరిపించి ఉంటుందని టీడీపీ కార్యకర్తలు గుసగుసలాడుకున్నారు.