iDreamPost
android-app
ios-app

బీజేపీకి జన ఆశీర్వాదం లభిస్తుందా…?

బీజేపీకి జన ఆశీర్వాదం లభిస్తుందా…?

ఏడేళ్ళ మోడీ పాలన మీద ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోందని బీజేపీ భావిస్తోందా.. ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో గడ్డుకాలం తప్పదనే భావనకు బీజేపీ అధినాయకత్వం వచ్చిందా. ఇటీవల ఇండియా టుడే విడుదల చేసిన సర్వేలో కూడా మోడిమీద ప్రజల్లో విశ్వాసం తగ్గిందని తెలిపింది. ఇపరిస్థితిని చక్కదిద్ది బిజెపి శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపేందుకు కొత్త ప్లాన్ వేసింది. క్షేతస్థాయిలో పార్టీని పటిష్టపరిచేందుకు ప్రజా ఆశీర్వాదా యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధం అవుతుంది. సాధారణంగా ఎన్నికలప్పుడు, ఏదైనా ప్రజాసమస్యల మీద పోరాటం చేసే సందర్భాలలో రాజకీయ పార్టీలు ప్రజల్లోకి వెళ్తాయి. కానీ తొలిసారిగా కేంద్రం తమ పథకాల ప్రచారం కోసం క్షేత్రస్థాయిలోకి వెళ్తుంది.

ఆగస్టు16న దేశవ్యాప్తంగా మొదలైన జన ఆశీర్వాద యాత్ర 22 రాష్ట్రాలలో 265 జిల్లాలలోని 212 లోక్సభ స్థానాలను కవర్ చేస్తూ19,567 కిలోమీటర్ల పాదయాత్ర కొనసాగేలా రూట్ మ్యాప్ ఖరారు చేసింది బిజెపి. 

అన్ని రాష్ట్రాల్లో కేంద్రమంత్రులు జన ఆశీర్వాద యాత్రను కొనసాగిస్తున్నారు. రాష్ట్ర బిజెపి నాయకత్వం ఈ జన ఆశీర్వాద యాత్రను విజయవంతం చేయడానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. కేంద్రం ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలును చివరి బిజెపి కార్యకర్తలకు వరకు తీసుకెళ్లేందుకే ఈ యాత్ర కొనసాగిస్తున్నట్లు బిజెపి నాయకులు చెబుతున్నారు

వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, గుజరాత్,హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో జన ఆశీర్వాద యాత్ర ద్వారా పార్టీని బలోపేతం చేయాలని బిజెపి నాయకత్వం భావిస్తోంది.వచ్చే లోక్సభ ఎన్నికల నాటికి మెజారిటీ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో క్షేతస్థాయిలో పార్టీని బలోపేతం చేసి కార్యకర్తల్లో జోష్ నింపాలని బిజెపి ప్లాన్ వేస్తుంది.

Also Read : దీదీ వ‌చ్చే.. ప‌ద‌వులు పాయే..!

రాష్ట్ర ప్రభుత్వాలకు అందించే నిధుల విషయంలో కేంద్రం వివక్షతో వ్యవహరిస్తోందని భాజపేతరా పార్టీలు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు విమర్శిస్తున్నాయి. మమతాబెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్,తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర వ్యవహరిస్తున్న తీరును ఎప్పటికప్పుడు ఎండగడుతూ ఉన్నారు.

బిజెపి జన ఆశీర్వాద యాత్రను విపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. బీజేపీ చేస్తున్నది జన ఆశీర్వాద యాత్ర కాదని జన వంచన యాత్ర అని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఏడేళ్లలో మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రజల ఇబ్బందులను ఆలోచించని మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు మేలు చేకూర్చే విధంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. బీజేపీ పాలనలో అంబానీ,ఆదానీల ఆస్తులు మాత్రమే రెట్టింపు అయ్యాయని విపక్షాలు విమర్శిస్తున్నాయి. నోట్ల రద్దు, విదేశాల్లో నల్లధనం వెనక్కి తేవడం,కరోనాను సరిగా ఎదుర్కోకపోవడం, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడం, డీజిల్,పెట్రోల్ రేట్లు విపరీతంగా పెరుగుతున్న ఆయిల్ సంస్థల పైన కేంద్ర ప్రభుత్వం నియంత్రణ లేకపోవడం, పార్లమెంట్లో చర్చ లేకుండానే బిల్లులు ఆమోదించడం ఇలా మెజార్టీ ఉందని కేంద్రం తీసుకుంటున్నా ఏకపక్ష నిర్ణయాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.

బీజేపీ పాలనలో రాజ్యాంగ బద్దంగా వ్యవహరించాల్సిన వ్యవస్థలన్నీటిని నీరుగార్చి తమకు అనుకూలంగా మార్చుకున్నారని విపక్షాల తో పాటు కోర్టులు కూడా వ్యాఖ్యానించడం మోడీ ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిది.

ప్రజల్లో కేంద్ర ప్రభుత్వంపై విశ్వాసం సన్నగిల్లుతోంది అని గమనించిన బిజెపి జన ఆశీర్వాద యాత్ర ద్వారా ప్రజా ఆశీర్వాదం పొందాలని చూస్తోంది. అయితే రాష్ట్రాలకు అందించే నిధులలో వివక్ష చూపకూడదని బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి సూచిస్తున్నాయి. వచ్చే రెండేళ్లలో అయినా కేంద్ర ప్రభుత్వం సామాన్య పౌరులకు మేలు చేకూర్చే విధంగా మోడీ ప్రభుత్వం వ్యవహరించాలని ప్రజలు కోరుకుంటున్నారు.

Also Read : హర్షకుమార్‌కు షాకిచ్చిన కాంగ్రెస్‌ పార్టీ