iDreamPost
android-app
ios-app

మోడి సొంత రాష్ట్రంలో బీజేపికి షాక్ ఇచ్చిన ఎంపీ

  • Published Dec 29, 2020 | 12:57 PM Updated Updated Dec 29, 2020 | 12:57 PM
మోడి సొంత రాష్ట్రంలో బీజేపికి షాక్ ఇచ్చిన ఎంపీ

గుజరాత్ బిజెపి ఎంపి ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి గిరిజన నాయకుడు మన్సుఖ్ వాసవ తన పార్టీకి రాజీనామా చేశారు. వచ్చే పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో లోక్‌సభకు సైతం రాజీనామా చేస్తానని ప్రకటించారు. నర్మదా జిల్లాలోని సర్దార్ వల్లభాయి పటేల్ స్టాట్యు ఆఫ్ యునిటీ విగ్రహం చుట్టూ ఉన్న 121 గ్రామాలను ఎకో సెన్సిటివ్ జోన్‌గా ప్రకటిస్తూ విడుదల చేసిన పర్యావరణ, అటవీ, మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకోవాలని కోరుతూ వాసవ గత వారం ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసిన విషయం తెలిసిందే.

MoEFCC నోటిఫికేషన్ పేరిట, ప్రభుత్వ అధికారులు గిరిజనుల ప్రైవేట్ ఆస్తులలో జోక్యం చేసుకోవవడమే కాకుండా నర్మదాలోని స్థానిక గిరిజనుల విశ్వాసాలను పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించడంతో గిరిజనుల విశ్వాసాన్ని కోల్పోయామని ప్రభుత్వం చర్యతో వారిలో భయం అపనమ్మకం ఏర్పడిందని ఇప్పుడు స్థానిక గిరిజనులు నిరసనలకు సిద్ధమవుతున్నారని ప్రభుత్వం, స్థానికుల మధ్య కమ్యూనికేషన్ లేకపోవడం స్థానికంగా తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఎంపి మన్సుఖ్ వాసవ ప్రధాని నరేంద్ర మోడీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.

అయితే ఈ లేఖ రాసిన కొద్ది రోజులకే వాసవ తన రాజీనామను ప్రకటించడం సంచలనంగా మారింది భారుచ్ నుండి ఆరుసార్లు ఎంపిగా ఎన్నికైన మన్సుఖ్ వాసవ ఇప్పటి వరకూ పార్టీకి నమ్మకస్తుడుగా పని చేశానని , అలాగే బీజేపీ అధిస్టానం సైతం తనకి అదే స్థాయిలో గౌరవం ఇస్తూ వచ్చిందని కాకపొతే ఇకపై తాను చేసిన తప్పుల వల్ల పార్టీ ఇమేజ్ దెబ్బతినకుండా ఉండటానికి కే ఈ రాజీనామా చేస్తునట్టు ప్రకటిస్తున్నాని గుజరాత్ బిజెపి అధ్యక్షుడు సి.ఆర్.పతిల్ కు రాసిన లేఖలో పేర్కోన్నారు. వచ్చే ఏడాది మొదట్లో గుజరాత్‌లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలలో వేళ గిరిజనుల వ్యతిరేకతకు తోడు స్థానిక ఎంపీ అయిన మన్సుఖ్ వాసవ చేసిన రాజీనామా ఆ పార్టీ పైన తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి.