iDreamPost
android-app
ios-app

ఓటర్లకు సాష్టాంగ నమస్కారం చేస్తున్న బీజేపీ ఎమ్మెల్యే..

ఓటర్లకు సాష్టాంగ నమస్కారం చేస్తున్న బీజేపీ ఎమ్మెల్యే..

ఆయనొక బీజేపీ మాజీ ఎమ్మెల్యే… గతంలో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఓ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యారు.. కానీ 2015 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం వేరొక నియోజకవర్గంలో పోటీ చేయాలని అధిష్టానం ఆదేశించడంతో వేరొక నియోజకవర్గంలో పోటీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కొత్త నియోజకవర్గంలో పోటీ చేయాల్సి రావడంతో కేవలం 666 ఓట్ల తేడాతో ఓడిపోయారు. కానీ ఈసారి మాత్రం ఎలాగైనా గెలవాలని నిశ్చయించుకున్నారు. అందుకే తనకు ఓట్లు వేయమని ఓటర్లను విన్నూత్న పద్దతిలో అర్ధించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఆయన మరెవరో కాదు బీహార్ కి చెందిన మాజీ ఎమ్మెల్యే అమరేంద్ర ప్రతాప్ సింగ్..గతంలో ఆయన  బీహార్ లోని ఆరా నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇప్పుడు ఆయనకు 73 సంవత్సరాలు. కాగా 2015 ఎన్నికల్లో ఆయనను ఆరా నియోజకవర్గం నుండి కాకుండా భోజ్‌పూర్ నియోజకవర్గంలో పోటీ చేయమని బీజేపీ అధిష్టానం ఆదేశించడంతో ఆయన ఆరా నుండి కాకుండా భోజ్‌పూర్ లో పోటీ చేయాల్సి వచ్చింది.గత ఎన్నికల్లో ఓడిపోవడం వల్ల ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు ఓటర్లకు సాష్టాంగ నమస్కారం చేయడం విశేషం.

ఇప్పుడు అమరేంద్ర ప్రతాప్ సింగ్ సాష్టాంగ నమస్కారం చేస్తున్న ఫోటోలు న్యూస్ మీడియాలో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఏది ఏమైనా గెలిచినంత వరకే ఓటర్లు దేవుళ్లుగా కనబడతారు. గెలిచిన అనంతరం ఓటర్లను పట్టించుకునే నాయకులు అరుదుగా ఉంటారు. అమరేంద్ర ప్రతాప్ సింగ్ ఈ వయసులో గెలుపు కోసం చేస్తున్న ప్రయత్నాలు సఫలం అవుతాయో లేదో బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం తేలిపోనుంది.