iDreamPost
android-app
ios-app

బిజెపి కి టాటా విరాళం రూ. 356 కోట్లు

బిజెపి కి టాటా విరాళం రూ. 356 కోట్లు

ఎన్నికల విరాళాలు పొందడంలో భారతీయ జనతా పార్టీ(బిజెపి) మరో మారు వార్తల్లో నిలిచింది. అత్యధిక విరాళాలతో ధనిక పార్టీగా బిజెపి పేరొందింది. కార్పొరేట్ సంస్థల నుంచి బిజెపికి అత్యధికంగా విరాళాలు వస్తున్నాయి. తాజాగా 2018-19 ఏడాదికి సంభందించి తమకు 700 కోట్ల రూపాయల విరాళాలు వచ్చాయని బిజెపి ఎన్నికల సంఘానికి తెలిపింది. ఈ మేరకు ఎన్నికల కమిషన్ కు నివేదిక సమర్పించింది. 

ఈ విరాళాల్లో కేవలం టాటాకు చెందిన ఎలక్టోరల్‌ ట్రస్ట్‌ నుంచి రూ.356 కోట్ల విరాళాలు లభించాయి. 700 కోట్ల రూపాయల విరాళాలను చెక్కులు, ఆన్‌లైన్‌ పేమెంట్ల ద్వారా స్వీకరించినట్లు బిజెపి తెలిపింది. ఇందులో దాదాపు సగం విరాళాలు టాటాకు చెందిన ప్రోగ్రెసివ్‌ ఎలక్టోరల్‌ ట్రస్ట్‌కు చెందినవే కావడం గమనార్హం. బిజెపి కి విరాళాలు ఇవ్వడంలో టాటాకు చెందిన ప్రోగ్రెసివ్‌ ఎలక్టోరల్‌ ట్రస్ట్‌ మొదటి స్థానంలో నిలవగా.. ప్రుడెంట్‌ ఎలక్టోరల్‌ ట్రస్ట్‌ రూ.54.25 కోట్లు ఇచ్చి రెండో స్థానంలో నిలిచింది.