iDreamPost
android-app
ios-app

రాజధాని పై గవర్నర్ కు కన్నా లక్ష్మీనారాయణ లేఖ – లైన్ తప్పారు అంటు బీజేపీ పెద్దలు ఆగ్రహం?

  • Published Jul 18, 2020 | 3:18 PM Updated Updated Jul 18, 2020 | 3:18 PM
రాజధాని పై గవర్నర్ కు కన్నా లక్ష్మీనారాయణ లేఖ  – లైన్ తప్పారు అంటు  బీజేపీ పెద్దలు ఆగ్రహం?

రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం తీసుకున్న రాజధాని వికేంద్రీకరణ నిర్ణయం తుది అంకానికి చేరుకుంది. తెలుగుదేశం మొదటి నుండి అడ్డుపడుతూ అవాంతరాలు సృష్టించినా చట్టపరంగా ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోయింది. మండలిలో బిల్లుని నిబందనలకు విరుద్దంగా మండలి చైర్మన్ విచక్షణాధికారం పేరుతో సెలక్టు కమిటీకి పంపినా రాజ్యంగంలోని 197వ అధికరణ ఆధారంగా ప్రభుత్వం రెండవసారి అదేబిల్లుని మండలిలో ప్రవేశపెట్టడంతో చట్ట ప్రకారం 30రోజుల్లో ఆమోదం పొందే వెసులుబాటు వలన నేడు ఆ బిల్లుని రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ ఆమోదం కొరకు పంపింది.

ఈ పరిణామాలతో మొదటి నుండి రాజధాని వికేంద్రికరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తెలుగుదేశం నేతలు రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని , విశాఖకు, కర్నూలుకు తరలించవద్దు అని కోరుతూ తెలుగుదేశం నేత యనమల రామకృష్ణుడు గవర్నర్ కు లేఖ రాసారు. అయితే మొదటి నుండి ఆంద్రప్రదేశ్ లో బీజేపీకి అధ్యక్షుడిగా ఉంటూ కేంద్ర బీజేపీ పెద్దల నిర్ణయాలకు వ్యతిరేకంగా , రాష్ట్రంలో తెలుగుదేశం వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే అరోపణలు ఎదుర్కుంటున్న కన్న లక్ష్మీనారాయణ కూడా బీజేపీ పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా రాజధాని వికేంద్రీకరణ బిల్లు పై ఆమోద ముద్ర వేయవద్దు అని లేఖ రాయడం వివాదాస్పదం అయింది .

రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ మూడు రాజధానుల పై గవర్నర్ కు లేఖ రాస్తూ రాష్ట్ర ప్రభుత్వం పంపిన వికేంద్రీకరణ బిల్లుని రాష్ట్ర ప్రజలు ఎవరూ స్వాగతించడంలేదని. వికేంద్రీకరణ బిల్లు ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు వ్యతిరేకంగా ఉందని. రాజధాని ప్రాంతంలో జరుగుతున్న ఆందోళనలు దృష్టిలో పెట్టుకోవాలని కోరుతూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు లేఖ రాశారు. ఆయితే కన్నా రాసిన ఈ లేఖపై కేంద్ర బీజేపీ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. పార్టీ వైఖరికి వ్యతిరేకంగా కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం లైన్ లో గవర్నర్ కు లేఖ రాసారని బిజెపి అధిష్టానం అభిప్రాయపడింది. ఇదే విషయం గవర్నర్ కు కేంద్ర బీజేపీ పెద్దలు వివరణ ఇచ్చే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.

కన్నా లక్ష్మీనారాయణ వ్యవహారం రాష్ట్రంలో మొదటి నుండీ వివాదాస్పదంగానే ఉందని బీజేపీ నేతల్లోని ఒక వర్గం చెబుతున్నమాట , బీజేపీ పార్టీ అభిప్రాయాలకు విరుద్దంగా తెలుగుదేశం పార్టీకి లాభం చేకూర్చేలా ఆయన వ్యవహార శైలి ఉన్నట్టు పలువురు చెబుతున్న మాట . గతంలో కూడా కన్నా బీజేపీ అధిష్టానంని సంప్రదించకుండా రాష్ట్ర ప్రభుత్వం పై కరోనా ర్యాపిడ్ కిట్ల వ్యవహారంలో అడ్డగోలుగా నిరాధార ఆరోపణలు చేసి నవ్వులపాలు అవ్వడంతో పాటూ కేంద్రం సైతం ఇరుకునపడేలా వ్యవహరించారు. దీంతో ఆనాడే కేంద్ర పెద్దలు కన్నా పై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు వార్తలు వచ్చాయి, ఈ ఘటన మర్చిపోకముందే మళ్ళీ రాజధాని విషయంలో గవర్నర్ కు లేఖ రాసి మరో సారి బీజేపీ లైన్ దాటి కన్నా ప్రవర్తించినట్టు చెబుతున్నారు. దీంతో కన్నా పై బీజేపీ అధిస్టానం ఎలాంటి చర్యలకు దిగుతుందో వేచి చూడాలి .