టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును భవిష్యత్తులో కూడా తమ దగ్గరకు రానివ్వమని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యమూర్తి అన్నారు. బుధవారం అయన గుంటూరులో మీడియా తో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ సహా ఆయన భార్యపై సైతం విమర్శలు చేశారని అయన గుర్తు చేశారు. టీడీపీతో కేంద్రానికి, బీజేపీకి ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేశారు. చచ్చిపోయిన పార్టీని బతికించుకోవటానికే చంద్రబాబు ఇప్పుడు మోదీపై ప్రశంసలు కురిపిస్తూ నాటకాలకు తెరతీశారని దుయ్యబట్టారు. నవంబరులో కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్రంలో పర్యటిస్తారని తెలిపారు.