భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.. పలువురు ప్రముఖులు నాయకులు రామ్‌నాథ్ కోవింద్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోడీ, హోం శాఖ మంత్రి అమిత్ షా,తెలుగు రాష్ట్రాల గవర్నర్లు బిశ్వ భూషణ్ హరిచందన్,తమిళసై సౌందరరాజన్ తో పాటు మరికొందరు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రధాని మోడీ ట్విట్టర్ ద్వారా “రాష్ట్రపతికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన తెలివితేటలు, విధానాలను ఆర్థం చేసుకునేతీరు అమోఘం. అవి దేశానికి గొప్ప ఆస్తులు. సేవ చేయడంలో ఆయన ముందుంటారు. ఆయన ఆరోగ్యంగా జీవించాలని’ కోరుతూ ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలియజేశారు.
గౌరవనీయ అధ్యక్షుడు శ్రీ రామ్ నాథ్ కోవింద్ జికి పుట్టినరోజు శుభాకాంక్షలు. దేశంలోని పేద, అణగారిన వర్గాల సంక్షేమం, సాధికారత పట్ల మీ అంకితభావం అందరికి స్ఫూర్తినిస్తుంది. మీ తెలివితేటలు మరియు నైపుణ్యం దేశానికి కొత్త బలాన్ని ఇచ్చాయి. మీకు మంచి ఆరోగ్యం మరియు దీర్ఘాయువు ఉండాలని కోరుకుంటున్నానని అమిత్ షా ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.
రాంనాధ్ కోవింద్ ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ తెలుపగా,తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ దేశానికి రాష్ట్రపతి చేస్తున్న సేవలను కొనియాడారు. మీరు సంపూర్ణ ఆయురారోగ్యాల తో భారత దేశ సేవలో కొనసాగాలని ఆశిస్తున్నాను. మీ మార్గ నిర్దేశం లో భారత దేశం మరింత అభివృద్ది చెందాలని కోరుకుంటున్నాను అంటూ ట్వీట్ చేశారు..