iDreamPost
android-app
ios-app

వింత టాస్కులతో బాస్ సందడి

  • Published Sep 09, 2020 | 6:00 AM Updated Updated Sep 09, 2020 | 6:00 AM
వింత టాస్కులతో బాస్ సందడి

బిగ్ బాస్ హౌస్ లో టాస్కుల పర్వం మొన్నటి నుంచే మొదలైన సంగతి తెలిసిందే. ఈ వీకెండ్ లో ఎలిమినేషన్ ఉంటుంది కాబట్టి పార్టిసిపెంట్స్ అందరూ సాధ్యమైనంత ఎమోషనల్ డ్రామాకు సిద్ధమవుతున్నారు. అందుకు తగ్గట్టే పెర్ఫార్మన్స్ లు కూడా కనిపిస్తున్నాయి. నిన్న కరాటే కళ్యాణికి బిగ్ బాస్ వెరైటీగా టీచర్ టాస్క్ ఇచ్చాడు. హౌస్ లో ఎలా నడుచుకోవాలో వివరించే రూల్స్ బోధించమని చెప్పడంతో ఆవిడా మరీ ఓవర్ చేయకుండా చక్కగానే చెప్పే ప్రయత్నం చేశారు. సభ్యులు సినిమాటిక్ స్టైల్ లో టీజ్ చేసినప్పటికీ అంతా సరదాగా సాగిపోయింది. గంగవ్వ సైతం ఉనికిని చాటేలా మెల్లగా తనదైన శైలిలో చిన్న కౌంటర్లు ఇవ్వడం మొదలుపెట్టారు.

ఆవిడకు ఈ షో మీద అంతగా అవగాహన లేకపోవడంతో పాటు వయసు దృష్ట్యా తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధ మెచ్చదగిందే. అందరూ గౌరవం చూపించడం కూడా గమనించాల్సిన అంశం . ఇక దర్శకుడు సూర్య కిరణ్ ప్రేమికుడు సినిమా సాంగ్ ని తమిళ్ లో పాడి కొంత హుషారు తెచ్చే ప్రయత్నం చేశారు. పాట బాగానే వచ్చింది కూడా. కొంత బూస్ట్ అప్ లాగా పనికివచ్చింది. గ్రూపులుగా విడగొట్టి పెయింటింగులు వేయమని ఇచ్చిన టాస్కు కూడా ఓ మాదిరిగా నడిచింది. ఒకళ్ళు వేసిన ఆర్ట్ ని మరొకరు వర్ణన చేస్తే ఇంకొకరు గీసి చూపించడం దీని ఉద్దేశం. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఇంత అందమైన పెయింటింగ్స్ వీళ్ళు వేశారంటే నమ్మమని ఇదంతా ప్రీ ప్లాన్డ్ స్కెచ్ అని కామెంట్లు చేయడం గమనార్హం.

ఏది ఎలా ఉన్నా అవి మాత్రం మంచి కలర్ఫుల్ గా ఉన్న మాట వాస్తవం. మొత్తానికి ఏదో ఒక డ్రామాతో రోజు రక్తికట్టించడం పెద్ద ఛాలెంజ్ గా మారేలా ఉంది. అసలే పార్టిసిపెంట్స్ లో ఒకరిద్దరు తప్ప సెలబ్రిటీలు లేరనే అసంతృప్తి ఆడియన్స్ లో బలంగా ఉంది. అది క్రమంగా తగ్గించాలి అంటే బాగా మసాలా దట్టించాలి. ఇప్పటికింకా రెండు రోజులే అయ్యింది కాబట్టి మున్ముందు బోలెడు వివాదాలు రావడం ఖాయం. ఒకరిద్దరిని వచ్చే ఆదివారం బయటికి పంపించి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా కొంత పాపులర్ ఫిగర్స్ ని తెచ్చే ప్లానింగ్ జరుగుతోందట. దానికి సంబంధించిన క్లారిటీ నాగ్ వచ్చినప్పుడు తెలుస్తుంది. ప్రస్తుతానికి ఆన్ లైన్లో అందరికంటే ఎక్కువగా గంగవ్వ ట్రెండింగ్ లో ఉండటం అసలు ట్విస్ట్