బిగ్ బాస్ నాలుగో సీజన్.. ఊహించినట్లుగానే చాలా డల్ పేస్‌తో కొనసాగుతోంది. హౌస్‌లో కంటెస్టెంట్స్ మధ్య చాలా కన్‌ఫ్యూజన్ నెలకొంది. టాస్క్‌లు బిగ్‌బాస్ ఇస్తున్నా, వాటిని ఎలా పూర్తిచేయాలో అర్థం కాని పరిస్థితి కంటెస్టెంట్స్‌ది. సీక్రెట్ రూవ్‌ులోంచి బయటకు వచ్చి, హౌస్‌లోని 14 మంది కంటెస్టెంట్స్‌తో కలిసిన అరియానా గ్లోరీ, సోహెల్.. అసలు హౌస్‌లో ఏం చేస్తున్నారో ఎవరికీ అర్థం కావడంలేదు. హౌస్‌లో కట్టప్ప వున్నాడని బిగ్‌బాస్ చెబుతున్నాడు. ఆ కట్టప్ప ఎవరు.? అన్నదానిపై మళ్ళీ అదే గందరగోళం. ఏ పని చేయాలన్నాసరే, ‘కట్టప్ప’ వున్నాడు జాగ్రత్త.. అన్న భయం కంటెస్టెంట్స్‌లో కన్పిస్తోంది. సాటి కంటెస్టెంట్స్‌ని ప్రతి ఒక్కరూ అనుమానంగా చూడాల్సిందే. రోజుల తరబడి ఈ కట్టప్ప డ్రామా నడుస్తుండడంతో బిగ్‌బాస్ వూయర్స్‌కి బాగా బోర్ కొట్టేస్తోంది. నిజానికి, హౌస్‌లో బోల్డంత ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వగల కంటెస్టెంట్స్ వున్నారు. వృద్ధురాలైన గంగవ్వ సైతం పూర్తి ఎనర్జిటిక్‌గా కన్పిస్తోంది. కానీ, ఏం లాభం.? అంతా గందరగోళం. ప్రసారమవుతున్న ఎపిసోడ్‌లో ఒకదానికి ఒకటి సంబంధం లేని సన్నివేశాలు దర్శనమిస్తుండేసరికి.. ఇదేం రియాల్టీ షో? అని జనం ముక్కున వేలేసుకుంటున్నారు. మొదటి రోజు ‘షో’పై కన్పించిన ఆసక్తి రెండో రోజుకే మాయమైపోయింది. వీకెండ్‌లో హోస్ట్ నాగార్జున ఏమైనా క్లాస్ తీసుకుంటే తప్ప, హౌస్‌లో జరిగే పరిణామాల్లో మార్పు వచ్చేలా కనిపించడంలేదు. నిన్నటి ఎపిసోడ్ మరింత చప్పగా సాగింది. వున్నంతలో దివి, తోటి కంటెస్టెంట్లపై తన ఎనాలసిస్‌ని చెప్పడం కాస్త ఊరటగా అన్పించింది.