iDreamPost
iDreamPost
నామినేషన్ల ప్రక్రియ మొదలుపెట్టాక కాస్త వేడెక్కిన బిగ్ బాస్ 4 హౌస్ వాతావరణం ఇంకాస్త హీటెక్కించే దిశగా సాగించే ప్రయత్నం గట్టిగానే జరిగింది. తనను దివి టార్గెట్ చేయడం పట్ల అవమానంగా ఫీలైన లాస్య మళ్ళీ గుక్కతిప్పుకోకుండా ఏడుస్తూ సానుభూతిని సంపాదించుకునేందుకు తనవంతు కృషిని చేసింది. గంగవ్వ ఓదార్చింది కానీ అంత ఈజీగా లాస్య మాములు మనిషి అవ్వలేదు. ,ముందు నుంచి కన్నీళ్ళకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న మోనాల్ ను ట్రయాంగిల్ లవ్ స్టొరీ నడిపిస్తున్న అభిజిత్, అఖిల్ లు సారి చెప్పి మరీ కూల్ చేశారు. సోహైల్ తనను నామినేట్ చేయడం పట్ల అమ్మ రాజశేఖర్ ఏ మాత్రం పాజిటివ్ గా తీసుకోలేదు.
ఇది జరుగుతుండగానే బిగ్ బాస్ నుంచి హోటల్ టాస్క్ కు సంబంధించిన సూచనలు వచ్చాయి. ఇందులో అవినాష్ కి రహస్యంగా ఓ టాస్కు ఇచ్చాడు బిగ్ బాస్. ఎవరికి తెలియకుండా ఒక టీంలో ఉంటూ మరో టీంకు ఉపయోగపడేలా వెరైటీగా చేసిన పనులు ఓ మాదిరిగా నవ్వులు పూయించాయి. ఈ రహస్యం బయటపడకుండా పాస్ అవ్వాలని ఒకవేళ లీకైతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ముందే హెచ్చరించాడు. ఇక విషయానికి వస్తే హోటల్ లో పని చేసే సిబ్బందిగా అభిజిష్, లాస్య, అఖిల్, అమ్మ రాజశేఖర్, సుజాత, అవినాష్, దివి, మోనాల్ కు అప్పాయింట్ అయ్యారు. అక్కడికి వచ్చే గెస్టులుగా మెహబూబ్, సోహైల్, హారిక, గంగవ్వ, అరియానాలు ఫిక్స్ అయ్యారు.
ఇందులో భాగంగా హోటల్ కు వచ్చే వాళ్ళు స్టాఫ్ ని వీలైనంత విసిగించాలి. అయినా సరే టెంప్ట్ అవ్వకుండా సదరు సిబ్బంది వీళ్ళను ప్రసన్నం చేసుకుని డబ్బులు సంపాదించుకోవాలి. 5 స్టార్స్ తెచ్చుకోవాలి. అవినాష్ సీక్రెట్ టాస్క్ లో భాగంగా హారికను ఇన్ సల్ట్ చేయడం, అరియానాను ముద్దు పెట్టుకునే ప్రయత్నం చేయడం, వంటల్లో మోతాదుకి మించి ఉప్పు వేయడం లాంటి విపరీత చేష్టలకు పాల్పడ్డాడు. అభిజిత్, అవినాష్ కు వేరేవాళ్ళకు రేటింగ్స్ రాకుండా స్కెచ్ వేసుకున్నారు. ఇది ఈ రోజు కూడా కొనసాగబోతోంది. ఏవో శిక్షలు ఉన్నట్టు ప్రోమోలో హింట్ ఇచ్చారు. పర్వాలేదు అనిపించేలా సాగిన ఈ హోటల్ ప్రహసనం ఇంకో రెండు రోజులు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. కాయిన్ టాస్కును కూడా ఇలాగే సాగదీసిన బిగ్ బాస్ దీనికి కూడా అదే తరహా స్ట్రాటజీని ఫాలో అవుతున్నాడు. మొత్తానికి హోటల్ హంగామాతో ఈ వారం ఓ మోస్తరుగా సాగుతోంది