iDreamPost
android-app
ios-app

Bigg Boss 6 Telugu: రిలీజైన‌ ‘బిగ్‌బాస్‌’ సిక్స్ ప్రోమో, స్టార్ట్ ఎప్పుడంటే!

  • Published Aug 09, 2022 | 12:44 PM Updated Updated Aug 09, 2022 | 12:44 PM
  • Published Aug 09, 2022 | 12:44 PMUpdated Aug 09, 2022 | 12:44 PM
Bigg Boss 6 Telugu: రిలీజైన‌ ‘బిగ్‌బాస్‌’ సిక్స్ ప్రోమో, స్టార్ట్ ఎప్పుడంటే!

బుల్లితెరపై ‘బిగ్‌బాస్‌’ ఆరో సీజ‌న్ మొద‌ల‌వునుంది. తాజాగా ప్రోమో కూడా రిలీజ్ అయ్యింది. ఎప్పుడూ గ్లామ‌ర‌స్ గా మొద‌లైయ్యే ప్రోమో, ఈసారి అప్పగింతలప్పుడు పెళ్లికూతురు కంటతడి పెట్టుకోవడంతో ఆరంభ‌మైంది. మా ఇంటి మహాలక్ష్మిని పంపించడం నా వల్ల కావట్లేదమ్మా అంటూ పేరెంట్స్ ఎమోష‌న్స్ , పెళ్లి కూతురు వారిని ఓదారుస్తున్న వేళ ఒక్కసారిగా మాయ‌మ‌వుతారు. వాళ్ల‌కోసం పెళ్లి కూతురు వెతుకుతుంటే నాగార్జున ఎంట్రీ ఇచ్చి ‘అప్పగింతలు అయ్యే వరకు కూడా ఆగలేకపోయారంటే, అక్కడ ఆట మొదలైనట్టే’అని బిగ్‌బాస్‌ షో మొద‌లైన‌ట్లు చెబుతాడు.

‘లైఫ్‌లో ఏ మూమెంట్‌ అయినా బిగ్‌బాస్‌ తర్వాతే’, బిగ్‌బాస్‌ సీజన్‌ సిక్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌కి అడ్డా ఫిక్స్‌’అంటూ నాగ్ క్లోజింగ్ టాగ్ లైన్ తో ఈ ప్రోమో ముగుస్తుంది. మూడు సీజన్స్ తో పాటు, బిగ్‌బాస్‌ ఓటీటీని న‌డిపించిన నాగార్జున, ఆరో సీజన్‌కి కూడా హోస్టింగ్ చేస్తున్నాడు. ఈ సీజ‌న్‌లో పాల్గొనే కంటెస్టెంట్ల సంఖ్య‌ త‌గ్గింద‌ని చెబుతున్నారు. ఈ ద‌ఫా షోలో 12 లేదా 13 మంది కంటెస్టెంట్లు మాత్ర‌మే వుంటారు. ఇప్ప‌టికే వాళ్ల‌ను సెల‌క్ట్ కూడా చేశారు. ఈ నెల 25న క్వారంటైన్‌కు రెడీగా వుండాల‌ని కంటెస్టెంట్ల‌కు స‌మాచారం ఇచ్చిన‌ట్టు తెలిసింది. సెప్టెంబ‌ర్ 3, నాలుగో తేదీల్లో ప్రారంభం కానుంది.

ఇప్ప‌టిదాకా సోష‌ల్ మీడియా స్టార్స్ ను న‌మ్ముకున్న బిగ్ బాస్ ఈసారి ఎక్కువగా సినిమా వాళ్ల‌నే షోకి తీసుకురాబోతున్నారు. స్టార్‌ మాతో పాటు డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ లోనూ ఈ షో స్ట్రీమింగ్‌ కానుంది. అంటే రియాల్టీ షో హంగామా మొద‌లైన‌ట్లే.

 

Jojobet GirişHoliganbet GirişHoliganbet GirişHoliganbet GirişHoliganbet GirişHoliganbet GirişHoliganbetjojobetgrandpashabetimajbetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetvole girişEscortes BelgiqueCasibomGrandpashabetgrandpashabetJOJOBET GİRİŞLERİCasibomcasibom