iDreamPost
android-app
ios-app

అరుపులు కేకలు – హద్దులు దాటిన గొడవలు

  • Published Nov 17, 2020 | 5:51 AM Updated Updated Nov 17, 2020 | 5:51 AM
అరుపులు కేకలు – హద్దులు దాటిన గొడవలు

బిగ్ బాస్ కు మెహబూబ్ గుడ్ బై చెప్పేశాక ఫ్రెష్ గా పదకొండో వారం నామినేషన్ నిన్నటి నుంచి మొదలయ్యింది. ఇటీవలి కాలంలో ఓవరాక్షన్ పాళ్ళు ఎక్కువవుతోందని విమర్శలు వస్తున్నప్పటికీ సభ్యులు మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. గత వారం అఖిల్ కు అవసరానికి మించిన ప్రాధాన్యం ఇచ్చారని సోషల్ మీడియాలో విపరీతమైన కామెంట్లు వచ్చిన సంగతి తెలిసిందే. ఫేక్ నామినేషన్ ఎపిసోడ్ మిస్ ఫైర్ అయ్యింది కూడా. వీటి సంగతలా ఉంచితే నిన్నటి ఎపిసోడ్లో ఇతను స్వంత డబ్బా కొట్టుకోవడం మాత్రం ఆపడం లేదు. లేడీ పార్టిసిపెంట్స్ గురించి అవసరం లేని విషయాలన్నీ మాట్లాడాడు. అఖిల్ కి బిగ్ బాస్ ప్రశంసలు దక్కడం మరో ట్విస్ట్.

రేషన్ మేనేజర్ ని ఎన్నుకునే అధికారాన్ని ఉపయోగించుకున్న అఖిల్ ఈసారి ఆ ఛాన్స్ లాస్యకు ఇచ్చాడు. నాగ్ ప్రత్యేకంగా పంపిన మటన్ ని ఏదో కరువు బాధితుల మాదిరిగా అందరూ హడావిడి చేసి పంచుకున్నారు. ఇక టాస్కు సంగతి చూస్తే ఒక్కొక్కరు ఇద్దరు వరస్ట్ పార్టిసిపెంట్స్ ని నామినేట్ చేయాలని చెప్పాడు బిగ్ బాస్. ఈ క్రమంలో అభిజిత్, అఖిల్ ల మధ్య మినీ యుద్ధమే జరిగింది. ఇందులో భాగంగా తనను తాను పులితో పోల్చుకుని అఖిల్ చేసిన అతి మాములుగా లేదు. ఇదే స్థాయిలో హారికతో కూడా వాగ్వాదం జరిగింది. అయితే ఆ అమ్మాయి కూడా ధీటుగా కౌంటర్లు ఇచ్చి అఖిల్ కు డిఫెండ్ చేసింది.

సోహైల్ తాను కూడా అతి చేయకపోతే వెనుకబడతానని అనిపించిందేమో కాబోలు హారికతో మాట మాట పెంచేసి అర్థం లేని ఆర్గుమెంట్లు చేశాడు. ఆ తర్వాత అభిజిత్ సోహైల్, అరియానాలను నామినేట్ చేశాడు. ఇక్కడా గొడవల తూటాలు పేలాయి. వాడివేడిగా జరిగిన ఈ రాద్ధాంతంలో ఫైనల్ గా అభిజిత్, మోనాల్, హారిక, లాస్య, అరియానా, సోహైల్ లు నామినేషన్ లిస్టులో ఉన్నారు. అవినాష్ ఒక్క మోనాల్ వల్ల మాత్రమే నామినేట్ కావడంతో సేఫ్ అయ్యాడు. ఇక ఈ రోజు నుంచి ఈ రచ్చ ఇంకో స్థాయికి వెళ్ళేలా కనిపిస్తోంది. రేటింగ్స్ ఆశించినంత రాక యాతన పడుతున్న బిగ్ బాస్ ఇప్పట్లో ఈ డోస్ తగ్గించేలా లేడు