iDreamPost
android-app
ios-app

లాస్యకు కెప్టెన్ షిప్ – వీకెండ్ హంగామా

  • Published Sep 13, 2020 | 5:47 AM Updated Updated Sep 13, 2020 | 5:47 AM
లాస్యకు కెప్టెన్ షిప్ – వీకెండ్ హంగామా

బిగ్ బాస్ 4 ఫస్ట్ వీకెండ్ కి వచ్చేసింది. ఇంట్రో షోతో కలుపుకుని నిన్నటితో ఏడో రోజులోకి అడుగుపెట్టింది. ఇప్పటిదాకా జరిగిన ఘటనలను ఆధారంగా చేసుకుని నాగార్జున వాళ్ళకు ఫీడ్ బ్యాక్ ఇవ్వడం నిన్న ఎపిసోడ్ తో మొదలైంది. ఎవరు కట్టప్ప అనే టాస్క్ ఆశించినంత స్పందన దక్కించుకున్నట్టు కనపడకపోవడంతో నిర్వాహకులు దాన్ని తెలివిగా కెప్టెన్ ఎంపికపై ఫోకస్ పెట్టించారు. సీజన్ నాలుగులో ఫస్ట్ కెప్టెన్ గా లాస్య ఎంపికయ్యింది. స్వతహాగా యాంకర్ కావడంతో తను హౌస్ ని ఎలా నడిపిస్తుందనేది ఆసక్తి రేపబోతోంది.

నిన్న అరియనా, సోహైల్ లకు మిగిలిన పార్టిసిపెంట్స్ కు టైటిల్స్ ఇవ్వమని చెప్పడం కొంత వరకు ఇంటరెస్ట్ గానే అనిపించింది. వాళ్ళు ఇచ్చిన బిరుదులూ కొన్ని క్యాచీగానూ కొన్ని ఖంగాళీగానూ ఉన్నాయి. అఖిల్ కు రొమాంటిక్, అమ్మ రాజశేఖర్ కు జోకర్, దేవికి మిస్టర్ పర్ఫెక్ట్, మహబూబ్ కి మిర్చి, గంగవ్వకు టాపర్, నోయెల్ కు లౌడ్ స్పీకర్, అభిజీత్ కి డస్ట్ బిన్, సూర్య కిరణ్ కు లేజీ బం, హారికకు డ్రామా క్వీన్, కరాటే కళ్యాణికి తగవులమారి ఇలా చిత్రవిచిత్రమైన ఉపశీర్షికలతో కామెడీ చేశారు. ,మోనాల్ కు క్రయింగ్ బేబీగా జోర్దార్ సుజాతకు ఊసరవెల్లి నామకరణం చేయడం విశేషం. ఇక సభ్యులందరి వ్యక్తిత్వ విశ్లేషణలు నాగార్జున నిన్నే చేసేశాడు. సూర్య కిరణ్ కు ఇచ్చిన సున్నితమైన వార్నింగ్ ని బట్టి ఇవాళ ఎలిమినేషన్ అతనే అనే ఊహాగానాలు సోషల్ మీడియాలో ఊపందుకున్నాయి. ఇవాళ అది కూడా తేలబోతోంది.

ఇప్పటిదాకా బిగ్ బాస్ షోకి 5 కోట్ల ఓట్లు వచ్చాయని నాగ్ చెప్పారు. అది నిజమా కాదా అని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు ఉండవు కాబట్టి ప్రేక్షకులకూ నమ్మడం తప్ప వేరే మార్గం లేదు. మరోవైపు సభ్యుల ఆర్మీల పేరుతొ ఫేస్ బుక్, ఇన్స్ టా, ట్విట్టర్లలో హంగామా మొదలైపోయింది. రేటింగ్స్ సంగతి ఎలా ఉన్న బిగ్ బాస్ లో అంత కిక్ లేదన్నది పబ్లిక్ మాట. పెద్దగా ఇమేజ్ లేని వాళ్ళను తీసుకురావడం ప్రధానమైన మైనస్ గా నిలవగా వీక్ డేస్ లో సాగుతున్న ఎపిసోడ్లు చప్పగా ఉండటం కూడా ప్రతికూలంగా మారుతోంది. నిన్న వర్షం పాటకు అందరూ చిందులు వేయడం బాగానే ఉన్నా చొక్కాలు బనియన్లు విప్పి మరీ మగ పార్టిసిపెంట్స్ డ్యాన్సులు చేయడం ఏమిటో. ఇదంతా పక్కన పెడితే ఇకపై లాస్యకు కెప్టెన్ గా ప్రత్యేక బాధ్యత వచ్చేసింది. ఎక్కువ రెమ్యునరేషన్ తనకే ఇచ్చారన్న వార్త ప్రచారంలో ఉన్న నేపథ్యంలో తను ఎలా మెప్పిస్తుందో వేచి చూడాలి