iDreamPost
android-app
ios-app

హీరోలు జీరోలు – నాగ్ వన్ మ్యాన్ షో

  • Published Sep 20, 2020 | 7:00 AM Updated Updated Sep 20, 2020 | 7:00 AM
హీరోలు జీరోలు – నాగ్ వన్ మ్యాన్ షో

దిగ్విజయంగా మూడో వారంలోకి అడుగు పెడుతున్న వేళ బిగ్ బాస్ సీజన్ 4కు కావాల్సిన అసలైన మసాలా మెల్లగా వస్తోంది. సానుభూతి కోసం పార్టిసిపెంట్స్ ఆడుతున్న తీరు పట్ల అసంతృప్తి ఉన్న బిగ్ బాస్ అభిప్రాయాన్ని నాగార్జున వివిధ రూపాల్లో బయటపెట్టేస్తున్నారు. సేఫ్ గేమ్ ఆడి వ్యూయర్స్ దృష్టిలో ఏదో మంచివాళ్ళలా కనిపించాలని తాపత్రయపడుతున్న వాళ్లకు తనదైన శైలిలో గట్టి డోస్ ఇచ్చారు. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన గంగవ్వను ఉద్దేశించి చెల్లి అని పిలవడం మొత్తం ఎపిసోడ్ కే హై లైట్. ఆవిడ తన కన్నా వయసులో చిన్నదని అధికారికంగా ధృవీకరించుకున్న నాగ్ ఆమెను సోదరిగా ప్రకటించుకోవడం మంచి స్పోర్టివ్ స్పిరిట్.

ఈ విషయంలో నాగ్ అందరి మనసులను గెలిచిన మాట వాస్తవం. ఇక సెంటర్ అఫ్ అట్రాక్షన్ గా అమ్మ రాజశేఖర్ మారడం గమనార్హం. అతనికి మద్దతుగా వ్యతిరేకంగా సభ్యుల్లో రెండు వర్గాలు తయారవడం ఆకట్టుకుంది. టీవీ9 దేవి, లాస్య ఇద్దరూ అమ్మ రాజశేఖర్ వేస్తున్న జోకులపై నిరసన ప్రకటించేశారు. ఒకదశలో ఆయన ఏడ్చే దాకా వచ్చింది పరిస్థితి. ఏకంగా నాగార్జున రంగంలోకి దిగి బుజ్జగించాల్సి వచ్చింది. ఎవరిని ఉద్దేశించి అయితే అమ్మ రాజశేఖర్ ఓవర్ చేశాడని లాస్య ఆరోపించిందో ఆ దివి రివర్స్ లో లాస్యనే షటప్ అని చెప్పడం మరో ట్విస్టు. ఇక్కడ దివితో పాటు అవినాష్, నోయల్ అమ్మ రాజశేఖర్ కు మద్దతుగా నిలవడం గమనార్హం. నిన్న జరిగిన పరిణామాలు ఇకపై ప్రేక్షకులు ఆశించిన దానికన్నా ఎక్కువ కంటెంటే ఇవ్వబోతున్నాయన్న హింట్ ఇచ్చేశాయి.

ఐపిఎల్ మ్యాచ్ మొదలైన ఫస్ట్ డేనే ఇంత హంగామా చోటు చేసుకోవడం స్క్రిప్ట్ విషయంలో నిర్వాహకులు తీసుకుంటున్న జాగ్రత్తను స్పష్టంగా చూపిస్తోంది. హీరో జీరో కాన్సెప్ట్ కూడా పార్టిసిపెంట్స్ ని నిలువుగా చీల్చడం అనే ఉద్దేశంతో ప్రవేశపెట్టారు. దాన్ని నాగ్ చాలా బాలన్స్ గా మేనేజ్ చేయడం విశేషం. ఇందులో అమ్మ రాజశేఖర్ ని నియోల్ హీరోగా వర్ణించి కుమార్ సాయిని జీరో చేయడం మరో మలుపు. ఇలా మొత్తానికి వీకెండ్ షో ఎంటర్ టైన్ అయితే చేసింది. యాంకర్ గా నాగార్జున పాత్ర ఎంత కీలకమో ఇందులో స్పష్టమయ్యింది. ఇకపై వీక్ డేస్ లో నాగార్జున లేకపోయినా గ్రూపులుగా విడిపోయిన సభ్యులు రాజకీయాలు, కుట్రలు, కుతంత్రాలతో హడావిడి చేసేలా ఉన్నారు. రేటింగ్స్ రావాలంటే అవి ఉండాల్సిందే. అప్పుడే ఆట రక్తి కడుతుంది. కళ్యాణితో పాటు మరొకరు కూడా ఎలిమినేట్ అవ్వబోతున్నారని ఫ్రెష్ లీక్. అది ఎవరో వెళ్ళేది ఒకరేనా లేక ఇద్దరా అనేది ఇవాళ తేలిపోతుంది