iDreamPost
iDreamPost
రెండు రోజుల క్రితం దర్శకుడు శేఖర్ కమ్ముల ధనుష్ ల కాంబినేషన్ అనౌన్స్ చేయడం ఒక్కసారిగా మూవీ లవర్స్ ని ఆశ్చర్యానికి గురి చేసింది. భీభత్సమైన మాస్ సినిమాలతో దూసుకుపోతున్న ధనుష్ ని సెన్సిబుల్ దర్శకుడు ఎలా చూపిస్తారనే అనుమానం తెలుగు ప్రేక్షకుల్లో కలిగింది. తమిళ ఆడియన్స్ కి ఈయన సినిమాలు పెద్దగా అవగాహన లేకపోయినా డబ్బింగులు, యుట్యూబ్, ఇతరత్రా ఓటిటి ప్లాట్ ఫార్మ్స్ లో చూశారు కానీ ఎక్కువ ఐడియా లేదు. ఏదో ఒక మ్యాటర్ లేనిదే తమ హీరో ఒప్పుకోడు కదా అనే నమ్మకం వాళ్ళది. అసురన్, కర్ణన్, జగమే తంత్రం ఇలా ఏది చూసుకున్నా ధనుష్ ఇప్పటిదాకా టార్గెట్ చేసింది ఊర మాస్ నే.
కొత్త వినిపిస్తున్న సమాచారం మేరకు ఇప్పుడీ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తీయడానికి సుమారు నూటా యాభై కోట్ల దాకా బడ్జెట్ ని పెట్టబోతున్నట్టు తెలిసింది. ధనుష్ పారితోషికం యాభై కోట్ల దాకా ఉండొచ్చని చెన్నై టాక్. మొత్తంగా శేఖర్ కమ్ముల కెరీర్ లోనే అత్యంత ఖరీదైన సినిమాగా ఇది రూపొందడం ఖాయమని అర్థమైపోయింది. గతంలో తనకు మాస్ కథలు సూట్ కావని వాటిని సరిగ్గా చెప్పలేనని అన్న శేఖర్ కమ్ముల మరి ధనుష్ కోసం ఏదైనా ఎమోషనల్ సబ్జెక్టుని రాసుకున్నాడేమో తెలియాలి. ఒకప్పుడు రఘువరన్ బిటెక్, మిస్టర్ కార్తీక్, మరియన్ లాంటివి ధనుష్ చాలానే చేశాడు. ఇప్పుడు మళ్ళీ ఆలోచన మారిందేమో
ఆసియన్ సునీల్ నారంగ్ నిర్మిస్తున్న సినిమా కావడంతో ఈ కోణంలో కూడా అంచనాలు మొదలయ్యాయి. ఓపెనింగ్ ని చాలా గ్రాండ్ గా చేయబోతున్నారు. హీరోయిన్ గా సాయి పల్లవికి ట్రై చేస్తున్నట్టు టాక్ ఉంది. గతంలో శేఖర్ కమ్ములతో తను రెండు సినిమాలు చేయడం, ధనుష్ తో మారి 2 రూపంలో మ్యూజికల్ సెన్సేషన్ ఉండటం లాంటి కారణాలు పాజిటివ్ గా కనిపిస్తున్నాయి. మొత్తానికి శేఖర్ కమ్ముల టార్గెట్ డిఫరెంట్ గా కనిపిస్తోంది. ఒకవేళ సుకుమార్ రంగస్థలంలో ద్వారా కొత్త కోణాన్ని పరిచయం చేసినట్టు ఇతను కూడా ధనుష్ తో ఏదైనా వెరైటీగా ప్లాన్ చేశారేమో చూడాలి. మొత్తానికి చాలా ఇంటరెస్టింగ్ కాంబో అని మాత్రం చెప్పగలం