దశాబ్దకాలంగా ఎదురుచూస్తున్న భీమవరం ప్రజల కలని జగన్ సర్కార్ సాకారం చేసింది. ఇప్పటి వరకు 50 పడకల ఆసుపత్రిగా ఉన్న భీమవరం ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకలకు పెంచుతూ 10.15 కోట్లు మంజూరు చేసింది . దివంగత ముఖ్యమంత్రి వై.యస్ రాజశేఖర రెడ్డి నగరబాట సందర్భంగా భీమవరం వచ్చిన సమయంలో ప్రజలు విజ్ఞప్తి మేరకు ఆసుపత్రిని అభివృద్ది చేస్తాము అని హామీ ఇచ్చారు, కానీ ఆయన అకాల మరణంతో ఆ హామీ నెరవేరలేదు. తరువాత 10 ఏళ్ళగా అధికారంలో ఉన్న ప్రభుత్వాలు దీనిని పట్టించుకోలేదు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా భీమవరం వచ్చిన జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే భీమవరం ఆసుపత్రిని అప్ గ్రేడ్ చేస్తాము అని హామీ ఇచ్చారు, ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ తాజాగా 10.15 కోట్ల నిధులు మంజూరు చేశారు.
సొంత భూమిని విరాళం ఇచ్చిన వై.సి.పి శాసనసభ్యులు గ్రంధి శ్రీనివాస్ గారు
50 పడకల ఆసుపత్రిని అప్ గ్రేడ్ చేయడానికి భూమి లేకపోవటంతో భీమవరం వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులు ముందుకు వచ్చి తన తండ్రి వెంకటేశ్వర రావు తల్లి వెంకట రత్నమ్మ పేరుతో కోటి రూపాయల విలువ చెసే 2 ఎకరాల సొంత భూమిని ఆసుపత్రికి విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించి ఔదార్యాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా గ్రంది శ్రీనివాస్ మాట్లాడుతూ పవన్ కల్యాణ్ , పులపర్తి ఆంజనేయులు లాంటి వారిని కాదని భీమవరం ప్రజలు తనపై ఉంచిన నమ్మకంని నిలబెట్టుకుంటానని. గతంలో మాదిరే మరిన్ని అభివృద్ది కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు.