Idream media
Idream media
బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్ భారత్ కైవసం చేసుకుంది. చివరి మూడో మ్యాచ్ లో గెలిచిన 2-1 తేడాతో భారత్ సిరీస్ ను నెగ్గింది. ఒక దశలో ఓడిపోతుందనుకున్న చివరి మ్యాచ్‌లో భారత్ ఆటగాళ్లు అదరగొట్టారు ఆదివారం నాగపూర్ జామ్తా మైదానంలో జరిగిన పోరులో భారత్ 30 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. ముందుగా భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (33 బంతుల్లో 62; 3 ఫోర్లు, 5 సిక్సర్లు), కేఎల్ రాహుల్ (35 బంతుల్లో 52; 7 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేశారు.
అనంతరం బంగ్లా 19.2 ఓవర్లలో 144 పరుగులకే ఆలౌటైంది. నయీమ్ (48 బంతుల్లో 81; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగగా, మిథున్ (27) సహకరించాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 61 బంతుల్లో 98 పరుగులు జోడించి విజయం దిశగా నడిపించినా… భారత బౌలర్లు ఆ అవకాశం ఇవ్వలేదు. పేసర్ దీపక్ చహర్ కేవలం 7 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టగా… శివమ్ దూబేకు 3 వికెట్లు దక్కాయి. చహర్‌కే ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’, ‘సిరీస్’ అవార్డులు దక్కాయి.