iDreamPost
iDreamPost
ప్రపంచ వ్యాప్తంగా మహమ్మారిలా పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి ఇప్పటికే పలు దేశాలు కోవిడ్ నివారణకు వ్యాక్సిన్ తయారిలో నిమగ్నమై ఉన్నాయి. అయితే తాజాగా తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో భారత్ బయోటెక్ ఇండియా లిమిటెడ్ ఫార్మా కంపెనీ తాము ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ యొక్క నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవి) సహకారంతో ‘కోవాక్సిన్’ పేరిట వ్యాక్సిన్ అభివృద్ది చేసినట్టు దానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆమోదం కూడా లభించినట్టు చెప్పుకొచ్చారు.
అలాగే తాము అభివృద్ది చెసిన కోవాక్సిన్ ఫేస్ 1 ఫేస్ 2 క్లినికల్ ట్రైయిల్స్ నిర్వహించడానికి కూడా తాము పెట్టుకున్న దరఖాస్తును డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపిందని, జులై లో ఈ ట్రైల్స్ దేశవ్యాప్తంగా నిర్వహించబోతునట్టు, కరోనా కట్టడికి అందరికన్నా తామే ముందు ఈ స్వదేశీ వ్యాక్సిన్ ను తయారు చేసినందుకు గర్వంగా ఉందని, భారత్ బయోటెక్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ ఎల్లా చెప్పుకొచ్చారు.