Idream media
Idream media
పని ఒత్తిని కారణంగా భద్రాచలం ఆర్టీసీ డీఎం శ్రీనివాస్ బుధవారం తెల్లవారుజామున తెల్లవారుజామున విధి నిర్వహణలో స్పృహ కోల్పోయారు. చికిత్స కోసం ఆయనను… ఆర్టీసీ సెక్యూరిటీ సిబ్బంది భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. డీఎంకు డాక్టర్లు ఈసీజీ తదితర వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే విశ్రాంతి లేకపోవడం కారణంగానే ఆయన అలసటకు గురై లో బీపీతో స్పృహ కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. ఆర్టీసీ కార్మికులు గత 19 రోజులుగా సమ్మెలో ఉండటంతో ఆర్టీసీ బస్ స్టేషన్, బస్ డిపో నిర్వహణ బాధ్యతలు పూర్తిస్థాయిలో డీఎం, డీవీఎంలే చేపట్టారు. దీంతో విశ్రాంతి లేకపోవడంతో డీఎం తీవ్ర అలసటకు గురవడం వల్ల స్పృహ కోల్పోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కార్మిక సంఘాల నాయకులు పలువురు ఆయన్ను పరామర్శించారు.