iDreamPost
iDreamPost
ఇంట గెలిచి రచ్చ చేయమన్నారు పెద్దలు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇప్పటిదాకా ఇక్కడే ఇంకా పూర్తి స్థాయిలో రచ్చ చేయలేదు. అప్పుడే బాలీవుడ్ వైపు పరుగులు పెడుతున్నాడు. కెరీర్ లో దక్కిన మొదటి హిట్టు రాక్షసుడు. అది కూడా ఫ్రేమ్ టు ఫ్రేమ్ తమిళ రీమేక్. సక్సెస్ దక్కిందన్న మాటే కానీ అందులో హీరో టాలెంట్ కంటే దర్శకుడి టేకింగ్ స్క్రీన్ ప్లేకే ఎక్కువ ప్రశంసలు దక్కాయి. మాస్ హీరోగా నిలదొక్కుకోవడానికి గట్టి ప్రయత్నమే చేస్తున్నప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో సెటిల్ కాలేదనే చెప్పాలి. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న అల్లుడు అదుర్స్ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది.
ఇప్పుడు బెల్లంకొండ హీరో నటిస్తున్న ఛత్రపతి హిందీ రీమేక్ కు వివి వినాయక్ దర్శకుడిగా కన్ఫర్మ్ కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మొన్నటి దాకా చిరంజీవి లూసిఫర్ రీమేక్ చేపడతారని ఎదురు చూసిన మెగా ఫ్యాన్స్ కు ఇది ఒకరకంగా షాకే. అయితే స్క్రిప్ట్ విషయంలో ఏకాభిప్రాయం రాని కారణంగా వినాయక్ అందులో నుంచి తప్పుకున్నారన్న వార్త గతంలోనే వచ్చింది. సో ఇప్పుడు ఫైనల్ గా తనను డెబ్యూ మూవీ అల్లుడు శీనుతో టాలీవుడ్ కి పరిచయం చేసిన వినాయక్ నే సాయి శ్రీనివాస్ ఇప్పుడు నార్త్ లాంచ్ కు కూడా ఎంచుకోవాల్సి వచ్చింది. పెన్ స్టూడియోస్ దీనికి నిర్మాత.
సాయి శ్రీనివాస్ కు తన సినిమాలన్నీ హిందీ డబ్బింగ్ వెర్షన్ల రూపంలో అక్కడ భారీ స్పందన దక్కించుకున్నాయి. అవన్నీ యుట్యూబ్, సోనీ జీ లాంటి శాటిలైట్ ఛానల్స్ లోనే. అంతమాత్రాన వాళ్లంతా రేపు ఇతని కోసం థియేటర్లకు వస్తారని చెప్పడానికి లేదు. అందులోనూ 15 క్రితం వచ్చిన బ్లాక్ బస్టర్ కి రీమేక్ ఇది. అసలు కథకులు విజయేంద్ర ప్రసాద్ కొన్ని మార్పులు చేశారట కానీ అవి ఎంత మాత్రం సింక్ అవుతాయో చూడాలి. ఒక్క ప్రభాస్ తప్ప బాలీవుడ్ లో గట్టిగా ప్రూవ్ చేసుకున్న స్టార్ ఎవరు లేరు. మరి సాయి శ్రీనివాస్ జస్ట్ ఒక ట్రయిల్ వేద్దామనుకున్నాడా లేక ఫ్యూచర్ ప్లానింగ్ కూడా ఉందేమో లెట్ వెయిట్ అండ్ సి