iDreamPost
android-app
ios-app

రాజమౌళి కన్నా ముందు త్రివిక్రమే

  • Published Apr 13, 2021 | 4:54 AM Updated Updated Apr 13, 2021 | 4:54 AM
రాజమౌళి కన్నా ముందు త్రివిక్రమే

నిన్న ఊహించినట్టే జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాక అందరి అనుమానాలు తీరాయి. నెలల తరబడి త్రివిక్రమ్ శ్రీనివాస్ తో తారక్ చేస్తున్నాడని చెబుతూ వచ్చిందంతా నిజం కాదని తేలిపోయింది. స్క్రిప్ట్ విషయంలో ఏకాభిప్రాయం రాలేదో ఇంకేదైనా కారణం ఉందేమో తెలియదు కానీ ఇది మాత్రం ఊహించని పరిణామం. మరి మాటల మాంత్రికుడు ఎవరితో టై అప్ కాబోతున్నాడనే దాని మీద అభిమానులు చాలా ఆసక్తిగా ఉన్నారు. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఫిక్స్ అయ్యిందని ఫిలిం నగర్ టాక్. ఇది కొత్త కథనా లేకా అదే స్క్రిప్టా అనేది తెలియాల్సి ఉంది.

ఈ కాంబో మీద సినిమా ప్రేమికులకు విపరీతమైన గురి ఉంది. ఏళ్ళు గడుస్తున్నా ‘అతడు’ చేస్తున్న మేజిక్ ఇంకా ఎక్స్ పైర్ కావడం లేదు. టీవీలో వచ్చిన ప్రతిసారి రేటింగులతో అదరగొడుతోంది. ‘ఖలేజా’ కమర్షియల్ గా ఫ్లాప్ అయినప్పటికీ తర్వాత కల్ట్ స్టేటస్ దక్కించుకుంది. ఇప్పటికీ మహేష్ పెర్ఫార్మన్స్ పరంగా ఫ్యాన్స్ దీన్ని టాప్ 5 లో చెప్పుకుంటారు. అందుకే ఇప్పుడు మూడో సారి జత కడితే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో వేరే చెప్పాలా. అందులోనూ అజ్ఞాతవాసి దెబ్బ తిన్నాక త్రివిక్రమ్ స్టోరీల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కమర్షియల్ ఫ్లేవర్ ని మిస్ కాకుండాతన స్టైల్ ని ప్రెజెంట్ చేస్తున్నారు.

అందుకే ‘అరవింద్ సమేత వీర రాఘవ’ సూపర్ హిట్ అయితే ‘అల వైకుంఠపురములో’ ఏకంగా ఇండస్ట్రీ రికార్డులు సాధించి నాన్ బాహుబలిని తన ఖాతాలో వేసుకుంది. సో ఇప్పుడు ఖలేజా కంటే చాలా బెటర్ ప్రోడక్ట్ ని ఈ ఇద్దరి నుంచి ఆశించవచ్చు. ప్రస్తుతం సర్కారు వారి పాట షూటింగ్ లో బిజీగా ఉన్న మహేష్ ఆ తర్వాత త్రివిక్రమ్ సెట్ లో ఎంటరవ్వొచ్చు. రాజమౌళితో అనుకున్నది ఆర్ఆర్ఆర్ వల్ల ఇంకా ఆలస్యమయ్యే ఛాన్స్ ఉండటంతో ఆలోగా దీన్ని పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు. పుష్ప జాప్యం వల్ల అల్లు అర్జున్ తో అనుకున్న సినిమా కూడా కొరటాల శివ తర్వాత చేస్తారు.