గబ్బిలాలు మనకు పాడుబడ్డ భవంతుల్లోనూ ఇళ్లల్లో కనిపిస్తాయి.. గబ్బిళాలు ఇళ్లలో ఉంటే అరిష్టంగా భావిస్తాం. అవి ఎదురుగా ఉంటే చాలు కీడుగా జరుగుతుందన్న భయం.. ఈ గబ్బిళాల వల్లే కరోనా ప్రభలిందనే ప్రచారం.. కానీ ఆ ఊరి జనం గబ్బిళాలను దైవ స్వరూపాలుగా భావించి భక్తితో పూజలు చేస్తారు. అంతే కాదు ఆ ఊరిలోని చెట్లనిండా గబ్బిళాలే దర్శనమిస్తాయి.. అంతేందుకు గ్రామంలోకి అడుగు పెట్టగానే స్వాగతం పలికేది కూడా ఈ గబ్బిళాలే.. ఇంతకీ ఎక్కడుందా ఊరు.. ఏమిటా కథ అని ఆశ్చర్య పోతున్నారా.. అదేంటో మీరే చూడండి..
ఊరు పేరు మాధవరం పోడు.. కడప జిల్లా రైల్వే కోడూరు మండల సరిహద్దులో ఉన్న ఈ గ్రామానికి ప్రత్యేకత ఉంది.. అదేంటంటే ఇక్కడ ఏ చెట్టును చూసినా గబ్బిలాలే దర్శనమిస్తాయి.. అంతే కాదు ఈ గబ్బిలాలంటే ఈ ఊరి జనానికి ఎంతో భక్తి.. ఎక్కడా లేని వింత ఆచారం ఈ గ్రామంలో కనిపిస్తుంది.. ఇక్కడి వారంతా వాటిని దైవ స్వరూపాలుగా బావించి పూజలు చేస్తారు. ఒకప్పుడు గ్రామంలోని పెద్ద చెట్టుపై పదుల సంఖ్యలో వచ్చి చేరిన ఈ గబ్బిలాలు క్రమ క్రమంగా పెరిగి వందల సంఖ్య దాటి వేలకు చేరాయి..
అమ్మో ఇన్ని గబ్బిలాలా అని ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.. మాధవరం పోడులో ఇవి సర్వసాధారణమే.. దేశంలో ఎక్కడా కూడా గబ్బిలాలను పూజించడం, వాటికి ఇంత ప్రాధాన్యత ఇవ్వడం మనకు కనిపించవు.. పురాణాల్లో, ఇతిహాసాల్లో సైతం గబ్బిలాల ప్రస్థావన అంతగా కనించదు.. కానీ మాధవరం పోడులోని గ్రామస్తులు తమ పిల్లలకు జబ్బు చేస్తే గబ్బిలాలుండే చెట్టు చుట్టూ తిప్పి పక్షులున్న చెట్టు క్రింద మట్టిని ఒంటినిండా పూసి, చెత్తతో నీళ్లు కాచి స్నానం చేయించి పూజలు చేస్తే నయమవుతందని ఇక్కడి ప్రజల విశ్వాసం.
ఈ ప్రాంత వాసులే కాదు సుధూర ప్రాంత వాసులు కూడా తమ పిల్లలకు జబ్బు చేస్తే ఇక్కడికి వచ్చి పూజలు చేసిన తర్వాత నయమైన సందర్బాలు ఎన్నో ఉన్నాయంటున్నారు. చేతులు కాళ్లు మెలేసుకోని పుట్టిన పిల్లలను ఇక్కడికి తీసుకోచ్చి పూజలు చేశాక నయం కావడం కళ్లారా చూశామని చెబుతున్నారు. అంతే కాక గతంలో ఈ గ్రామానికి చెందిన వారు ఆర్దికపరమైన ఇబ్బందులతో సతమతమయ్యేవారు. గబ్బిలాలు గ్రామంలోకి వచ్చి చేరాక తమకు బాగా ఉందని నాడు పూరి గుడిసెల్లో నివాసమున్న తాము ఇప్పుడు పక్కా ఇళ్లు కట్టించుకోని జీవిస్తున్నామని చెబుతున్నారు. గ్రామానికి గబ్బిలా లు వచ్చాకే మంచి జరుగుతుందంటున్నారు.
చాలా ప్రాంతాల్లో గబ్బిళాలను అపశకునంగా భావిస్తే ఈ ఊరి జనం మాత్రం దైవత్వాన్ని ఆపాదించి పూజించడం వింతగా కనిపిస్తోంది కదూ.. గబ్బిలాలు నివసించే ఇళ్లల్లో నివాసం ఉండటానికి నిరాకరించే పరిస్ధితి.. అలాంటిది గ్రామంలో వేలాది గబ్బిలాలు సంచరిస్తున్నా వారు అక్కడే నివసిస్తున్నారంటే వాటిపై గ్రామస్తులకు ఉన్న భక్తి భావాలు ఏ పాటివో అర్దం చేసుకోవచ్చు.. ఊరికి దూరంగా న్న దేవుని మర్రిమానుపై ఉన్న ఈ గబ్బిలాలు గత నలబై ఏళ్ల క్రితం గ్రామంలోకి వచ్చి చేరాయని చెబుతున్నారు..
అందరూ గబ్బిళాలను చూసి భయపడితే మాధవరం పోడు వాసులు మాత్రం భక్తితో పూజించడం ఆశ్చర్యంగా ఉన్నా ఇందులో మూఢ నమ్మకాలు ఎక్కువగా ఉన్నాయని కోందరి వాదిస్తున్నారు.. అంతే కాదు కరోనా వైరస్ సైతం గబ్బిలాల ద్వారా వచ్చిందనే ప్రచారం కూడా ఉంది.. అయితే ఎవరేమన్నా ఈ ఊరి జనం మాత్రం గబ్బిలాలను దైవ స్వరూపాలుగా భావిస్తామని చెబుతున్నారు. పగటి పూటంతా చెట్టపై ఉండే గబ్బిళాలు సాయింత్రం ఆరుకు చెట్లను విడిచి వెళ్లిపోయి తిరిగి తెల్లవారుజామున నాలుగు గంటలకే చేరుకుంటాయి. అవి ఎక్కడికి వెళ్లినా తిరిగి తమ గ్రామానికి చేరకుంటాయని గ్రామస్తులు చెబుతున్నారు.
కరోనా వైరస్ వ్యాప్తికి గబ్బిలాలే కారమని ప్రచారం జరుగుతున్నా వీటి వల్ల గ్రామానికి మంచి జరిగిందన్నది ఊరి జనం నమ్మకం విశ్వాసం.. అందుకే వీటిని ఎవ్వరూ కోట్టనివ్వకుండా కంటికి రెప్పలా కాపాడు కుంటూ వస్తున్నారు.. ఏది ఏమైనా ఈ ఊరి జనం మాత్రం వాటిని దైవ స్వరూపాలుగానే భావిస్తారనేది అక్షర సత్యం..