ఇటీవల తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ స్టైక్‌కు దిగిన బంగ్లాదేశ్ క్రికెటర్ల దెబ్బకు ఆ దేశ క్రికెట్ బోర్డు బీసీబీ దిగొచ్చింది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నుంచి క్రికెటర్లకు గురువారం స్పష్టమైన హామీ లభించడంతో స్ట్రైక్‌ను విరమించారు. ఈ మేరకు తమ క్రికెటర్లతో సుదీర్ఘ చర్చలు జరిపిన బీసీబీ.. సాధ్యమైనన్ని డిమాండ్లను నేరవేర్చడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 11 ప్రధాన డిమాండ్లతో నిరసన గళం వినిపించగా వాటిలో తొమ్మిది డిమాండ్లను తీర్చడానికి బీసీబీ ముందుకొచ్చింది. ఫలితంగా షకిబుల్ హసన్ నేతృత్వంలోని క్రికెటర్లు సమ్మె విరమించడంతో భారత్ పర్యటనకు మార్గం సుగమం అయ్యింది.