iDreamPost
android-app
ios-app

బండ్ల గణేష్ కు కరోనా పాజిటివ్

బండ్ల గణేష్ కు కరోనా పాజిటివ్

హైదరాబాద్ లో కరోనా వైరస్ ప్రమాదకర స్థాయిలో వ్యాపిస్తున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కరోనా వైరస్ సోకినట్లు నిర్దారణ అయింది. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. బండ్ల గణేష్ ఎవరెవరిని కలిశారు అనే దానిపై ఆరా తీస్తున్నారు.

బండ్ల గణేష్ కు కరోనా అని నిర్దారణ కావడంతో కుటుంబ సభ్యులందరికీ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించారు. ఈరోజు(శనివారం) కుటుంబ సభ్యుల ఫలితాలు వచ్చే అవకాశం ఉందని కుటుంబ సభ్యులు వెల్లడించారు. కాగా బండ్ల గణేష్ కు కరోనా సోకడంతో సినీ వర్గాల్లో ఆందోళన మొదలయింది. సినీ ప్రముఖుల్లో బండ్ల గణేష్ ని కలిసిన వారిలో కొందరు ముందు జాగ్రత్తగా వ్యాధి నిర్దారణ పరీక్షలు చేయించుకున్నారన్న వార్తలు వస్తున్నాయి.

ఆయన ఇటీవల హెయిర్ ప్లాంటేషన్‌కు వెళ్లారని ఈ క్రమంలో వైరస్ సోకి ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా బండ్ల గణేష్ జూబ్లీహిల్స్‌ ఫిలింనగర్‌లోని రామానాయుడు స్టూడియోకు సమీపంలో ఉన్న కాలనీలో నివాసం ఉంటున్నారు. బండ్ల గణేష్  ఉంటున్న ఇంటికి సమీపంలోనే హీరో నాగశౌర్య, ఇతర సినీ కుటుంబాలు ఉన్నాయి. దీంతో వారిలో ఆందోళన మొదలయింది. అధికారులు సినివర్గాల్లో ఇంకెవరికైనా వ్యాధి వ్యాపించిందా అన్న కోణంలో విచారణ చేస్తున్నారు.

jojobet girişJojobet GirişJojobet GirişCasibomkarın ağrısına ne iyi gelirKulisbetKulisbetMadridbetkatlaJojobet GirişJojobet GirişMarsbahis GirişCasibom GirişMarsbahis Giriş