iDreamPost
iDreamPost
అమెరికా కేంద్రం గా చేసుకుని మన దేశానికి వ్యతిరేకంగా కార్యకలాపాలకు ప్రయత్నిస్తున్న ముగ్గురిని గుర్తించారు. అందులో ఒకరు పాకిస్తానీయుడు కాగా మరో ఇద్దరు భారతీయులున్నారు.
భారతీయ సంతతికి చెందిన వారంతా కలిసి సాగించిన కార్యకలాపాలు కలకలం రేపాయి. భారతదేశంలో చిచ్చు పెట్టేందుకు ప్రయత్నం చేసినట్టు ఆధారాలు లభించాయి. దాంతో ఆ వివరాలను అమెరికా ప్రభుత్వం భారతదేశానికి తెలియజేసింది.
రాకేశ్ కౌశల్, దర్శన్ మెహతా అనే ఇద్దరు వ్యక్తులు పాకిస్తాన్ కి చెందిన రెహాన్ సిద్ధిఖీతో కలిసి భారతీయ యువతను పక్కదారి పట్టించే కుట్ర పన్నుతున్నారని గతంలో శివసేన ఎంపీ కేంద్రం దృష్టికి తీసుకొచ్చారు. వారి వివరాలను కేంద్రం హోం శాఖతో పాటుగా ప్రధానికి లేఖల రూపంలో తెలియజేశారు. దాంతో అమెరికా ప్రభుత్వం అప్రమత్తమయ్యింది వారి వివరాలపై ఆధారాలను సేకరించే ప్రయత్నం చేసింది.
చివరకు తాజాగా ఈ అంశంలో ఆ ముగ్గురిపై భారతదేశం నిషేధం విధించింది. వారు దేశంలో అడుగుపెట్టకుండా ఆదేశాలు జారీ చేసింది. భారతదేశంపై వారు కుట్ర పన్నుతున్న నేపథ్యంలో వాటిని అడ్డుకునేందుకు చర్యలు చేపట్టింది. ఈ విషయాన్ని కేంద్రం హోం శాఖ వెల్లడించింది. గతంలో కూడా ఇలాంటి ప్రయత్నాలు జరిగినప్పటికీ తాజాగా భారతీయ సంతతి వారే భారతదేశంపై కుట్రలో భాగస్వాములుగా ఉండడం విశేషం.