iDreamPost
android-app
ios-app

అన్ స్టాపబుల్ సీజన్ 2 రెడీ.. మళ్ళీ బాలయ్య బాబు హంగామా షురూ..

  • Published Jun 20, 2022 | 11:02 AM Updated Updated Jun 20, 2022 | 11:02 AM
  • Published Jun 20, 2022 | 11:02 AMUpdated Jun 20, 2022 | 11:02 AM
అన్ స్టాపబుల్ సీజన్ 2 రెడీ.. మళ్ళీ బాలయ్య బాబు హంగామా షురూ..

బాలకృష్ణాలోని మరో కోణాన్ని చూపించిన ప్రోగ్రాం అన్ స్టాపబుల్. ఈ కార్యక్రమం బాలయ్య బాబుని మరింత కొత్తగా ఆచూపించింది ప్రేక్షకులకి. ఆహా ఓటీటీలో బాలయ్య బాబు హోస్ట్ గా టెలికాస్ట్ అయిన ప్రోగ్రాం అన్ స్టాపబుల్ విత్ NBK బాగా క్లిక్ అయింది. అసలు బాలకృష్ణ ఏంటి? యాంకర్ ఏంటి? అనుకున్న వాళ్లంతా ఈ షో చూసి ఆశ్చర్యపోయారు. షోలో బాలయ్య బాబు ఎంటర్టైన్మెంట్, జోష్, హడావిడి, వచ్చిన గెస్టులతో ఆదుకోవడం, సెంటిమెంట్.. ఇలా అన్నిరకాలుగా షో సక్సెస్ అయింది.

బాలయ్యబాబు తన యాంకరింగ్ తో అభిమానులనే కాక ప్రేక్షకులందర్నీ మెప్పించాడు. అన్ స్టాపబుల్ షో తర్వాత బాలయ్య క్రేజ్ అమాంతంగా పెరిగిపోయింది. మన దేశంలో ప్రసారమయ్యే టాక్ షోలలోనే 9.7 రేటింగ్‌తో IMDBలో తొలి స్థానంలో నిలిచింది అన్ స్టాపబుల్. ప్రోగ్రాంని చాలా చక్కగా డిజైన్ చేసి టెలికాస్ట్ చేసింది ఆహా. మొదటి సీజన్ 10 ఎపిసోడ్స్ తో గ్రాండ్ గా ముగిసింది. మొదటి సీజన్ లో మంచు ఫ్యామిలీ, పుష్ప టీం, రవితేజ, అఖండ టీం, బ్రహ్మానందం, రాజమౌళి, రానా, మహేష్ బాబు.. ఇలా పలువురు సెలబ్రిటీలు వచ్చి అలరించారు.

దీంతో అన్ స్టాపబుల్ సీజన్ 2 ఎప్పుడొస్తుందా, బాలయ్య బాబుని మళ్ళీ ఆ రేంజ్ జోష్ లో ఎప్పుడు చూస్తామా అని అభిమానులు, ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. అన్ స్టాపబుల్ సీజన్ 2 గురించి పలు రకాల వార్తలు వచ్చినా ఆహా టీం అధికారికంగా ప్రకటించలేదు. అలాంటి వార్తలు అన్నిటికి చెక్ పెడుతూ ఆహా టీం అధికారికంగా అన్ స్టాపబుల్ సీజన్ 2 ప్రకటించింది. ఇటీవల ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ షోకి సెమి ఫైనల్ లో గెస్ట్ గా వచ్చిన బాలయ్యని అన్ స్టాపబుల్ సీజన్ 2 గురించి అడగగా.. మధుర క్షణాలకి ముగింపు ఉండదు, కొనసాగింపే అంటూ చెప్పారు. ఆ వీడియో బైట్ తో అన్ స్టాపబుల్ సీజన్ 2 కమింగ్ సూన్ అని పోస్ట్ చేశారు ఆహా టీం.

దీంతో బాలయ్య అభిమానులతో పాటు, ప్రేక్షకులు కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఈ సారి ఎవరెవరు గెస్టులుగా వస్తారా అని ఆలోచిస్తున్నారు. అన్ స్టాపబుల్ సీజన్ 2 మరింత సరికొత్తగా, మరింత ఎంటర్టైన్మెంట్ తో ఉండబోతుందని అంటున్నారు నిర్వాహకులు.

Jojobet GirişbetparkGrandpashabetgrandpashabetGrandpashabetMeritkingCasibomCasibomcasibomjojobet girişjojobetinterbahisjojobetMadridbetMadridbetJojobet girişgrandpashabetJojobetcasibomgrandpashabetjojobetcasibomjojobetjojobetcasibomcasibom girişgrandpashabetholiganbetgrandpashabet güncel girişjojobetjojobet girişgrandpashabet