iDreamPost
android-app
ios-app

BJP Congress – మళ్ళీ డిపాజిట్లు గల్లంతు.. జాతీయ పార్టీలకు అదొక్కటే ఊరట!

BJP Congress – మళ్ళీ డిపాజిట్లు గల్లంతు.. జాతీయ పార్టీలకు అదొక్కటే ఊరట!

2019 ఎన్నికల్లో బద్వేల్ నుంచి వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య అకాల మరణంతో నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. బద్వేల్ లో అధికార పార్టీ వైసీపీ అభ్యర్థిగా మరణించిన వెంకటసుబ్బయ్య భార్య సుధను బరిలో దించింది. చనిపోయిన ఫ్యామిలీకి ఈ ఉప ఎన్నికల్లో టికెట్ ఇవ్వడంతో చనిపోయిన వారి కుటుంబాల నుంచి అభ్యర్థిని నిలబెడితే పోటీ చేయకూడదనే సంప్రదాయం పాటిస్తూ టీడీపీ, జనసేనలు బద్వేల్ లో పోటీ చేయలేదు. కానీ బీజేపీ రంగంలోకి దిగడంతో ఆ పార్టీ కోసం లోపాయికారిగా పని చేశాయి. బీజేపీకి తగ్గట్టు కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి కూడా పోటీలో నిలబడినా దారుణ ఓటమి పాలయ్యారు. బద్వేల్ ఎన్నికల్లో ఫ్యాన్ ధాటికి కమలం, హస్తం కొట్టుకుపోయాయి. తాము గెలవమనే విషయం తెలిసినా వైసీపీ మెజార్టీ తగ్గింపే లక్ష్యంగా బరిలోకి దిగగా అదేమీ వర్కౌట్ కాలేదు.

బద్వేల్ నియోజకవర్గ ప్రజలు వైసీపీ పార్టీ అభ్యర్థి డా.సుధ వైపే మొగ్గు చూపడంతో ఆమెకు రికార్డు స్థాయి మెజారిటీ లభించింది. ఒకరకంగా డాక్టర్ సుధా ఏపీలో రికార్డులు బద్ధలు కొట్టారని చెప్పవచ్చు. డాక్టర్ సుధాకు 90 వేల 228 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో దాసరి సుధ భర్త వెంకట సుబ్బయ్య 44 వేల 734 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అయితే..ఆయన మరణానంతరం జరిగిన ఉప ఎన్నికల్లో సుధ భర్త కంటే దాదాపు రెట్టింపు మెజార్టీని కైవసం చేసుకున్నారు. దాసరి సుధకు మొత్తం లక్షా 11 వేల 710 ఓట్లు వచ్చాయి. సమీప ప్రత్యర్థి బీజేపీ క్యాండిడేట్ సురేష్ కు 21 వేల 621 ఓట్లు రాగా , కాంగ్రెస్ అభ్యర్థికి 6 వేల 205 ఓట్లు వచ్చాయి. అయితే ఇక్కడ బీజేపీ నిలబడినా బీజేపీ గెలుపు కోసం జనసేన సహా టీడీపీ కూడా లోపాయికారిగా పని చేసింది.

పోలింగ్ రోజున బీజేపీ తరపున ఏజెంట్లుగా టీడీపీ నేతలు కూర్చున్నారు. ఎంత ప్రయత్నం చేసినా మెజారిటీని మాత్రం ఏమీ చేయలేకపోయారు. అయితే జాతీయ పార్టీలు అయిన కాంగ్రెస్, బీజేపీలకు ఊరట ఏమిటంటే 2019 ఎన్నికల్లో వచ్చిన ఓట్ల కంటే ఇప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లో ఓట్లు పెరగడమే, టీడీపీ పోటీలో లేకపోవడంతో ఆ పార్టీ ఓట్లు బీజేపీకి షిఫ్ట్ అయ్యాయని చెప్పచ్చు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన డాక్టర్ వెంకట సుబ్బయ్యకు 95,482 ఓట్లు పోల్ కాగా, అప్పుడు బీజేపీ నుంచి పోటీ చేసిన తిరువీధి జయరాములుకు కేవలం 735 ఓట్లు పోలవగా, అప్పుడు కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కమలమ్మకు 2337 ఓట్లు పోలయ్యాయి. కానీ ఇప్పుడు బీజేపీకి 21 వేల 621 ఓట్లు రాగా , కాంగ్రెస్ అభ్యర్థికి 6 వేల 205 ఓట్లు వచ్చాయి. ఏదైతేనేం మొత్తంగా వైసీపీ ఖాతాలో మరో నియోజకవర్గం వచ్చి చేరింది.

Also Read : By Elections Congress – తెలంగాణలో కన్నా ఆంధ్రాలో కాంగ్రెస్ కు ఎక్కువ ఓట్లు