చంద్రబాబు రాజకీయ పన్నాగం మరోసారి బయటపడింది. బద్వేలు ఉప ఎన్నికల సాక్షిగా తెలుగుదేశం సానుభూతి వ్యవహారం బట్టబయలయ్యింది. పోలింంగ్ సందర్భంగా టీడీపీకి చెందిన నేతలు పలు చోట్ల కీలకంగా వ్యవహరిస్తున్నారు. నేరుగా ఆపార్టీ నాయకులే బీజేపీ అభ్యర్థి తరుపున పోలింగ్ ఏజెంట్లుగా ఉండడంతో టీడీపీ రాజనీతి స్పష్టమయ్యిందనే అభిప్రాయం వినిపిస్తోంది.
బద్వేలులో ఎమ్మెల్యే మరణం తర్వాత ఆయన భార్య డాక్టర్ సుధ ఉప ఎన్నికల బరిలో ఉన్నారు. దాంతో సానుభూతి కారణంగా తాము పోటీలో ఉండబోమని టీడీపీ ప్రకటించింది. తమ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత ఉపసంహరించుకుంది. తాము సెంటిమెంట్‌ని గౌరవించి,సంప్రదాయాన్ని ఆచరిస్తున్నట్టు చెప్పుకుంది. కానీ తీరా చూస్తే పోలింగ్ నాడు దానికి భిన్నంగా వ్యవహరిస్తోంది. గడిచిన కొన్ని వారాలుగా ప్రచారంలో టీడీపీ నేతలు బీజేపీ కి అనుగుణంగా వ్యవహరిస్తుండడం బద్వేలులో బహిరంగంగానే సాగుతోంది. తాజాగా పోలింగ్ వ్యవహారాలు చక్కబెట్టడంతో బాబు బండారం బయటపడింది.
తాము సంప్రదాయాన్ని గౌరవిస్తున్నామని ఓ వైపు చెప్పుకుంటూ,రెండో వైపు బీజేపీ అభ్యర్థిని బలపరిచేందుకు తన పార్టీ శ్రేణులను పురమాయించడం ఆశ్చర్యంగా కనిపిస్తోంది. కానీ బాబు అసలు నైజం అదేనని చాటుతోంది. ఆయన మాటలకు, చేతలకు పొంతన ఉండదని మరోసారి రూఢీ అయ్యింది. సిట్టింగ్ అభ్యర్థి మరణించినట్టైతే, వారి కుటుంబ సభ్యులు పోటీ చేస్తున్న పక్షంలో పోటీ పెట్టం అన్న టీడీపీ ప్రకటనకు, ఆచరణకు పొంతనలేదని తేలిపోయింది. తాము పోటీ చేస్తే ఘోరపరాభవం తప్పదని భయపడి పోటీ నుంచి తప్పుకున్న టీడీపీ ఇప్పుడు బీజేపీకి బీ టీమ్ లా వ్యవహరించడం ద్వారా అసలు బుద్ధిని ప్రదర్శించినట్టయ్యింది.
సిట్టింగ్ దళిత శాసనసభ్యుడి పట్ల గౌరవం చూపుతున్నామన్న చంద్రబాబు ప్రకటన కూడా పచ్చి మోసం. దళితుల పట్ల బాబు కపట ప్రేమ మరోటి కాదని బద్వేలు వైఎస్సార్సీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. బద్వేలులో బాహాటంగా బరిలో దిగిన టీడీపీ నాయకత్వం బీజేపీకి పనిచేస్తుండడంలో పెద్ద విశేషం లేదని చెబుతున్నారు. ఇలాంటి జిమ్మిక్కులతో టీడీపీ, బీజేపీలు సాధించేదేమీ ఉండదని అభిప్రాయపడుతున్నారు. ప్రజలు భారీ మెజార్టీతో జగన్ నాయకత్వాన్ని ఆదరిస్తారని, సుధకి విజయం చేకూరుస్తారని అధికార పార్టీ ధీమాతో ఉంది.
Also Read : Badvel, Huzurabad By Election – తెల్లవారితే ఉప సమరం.. ఈ అంశాలే ఆసక్తికరం