iDreamPost
android-app
ios-app

వైసీపీలో చేరిన దేవినేని అవినాష్

వైసీపీలో చేరిన దేవినేని అవినాష్

టీడీపీ నేత, ఆ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు దేవినేని అవినాష్ వైఎస్సార్ సిపి లో చేరారు. ఈ రోజు ఉదయం టీడీపీ లోని పదవులకు అవినాష్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. నిన్న బుధవారం కార్యకర్తలతో సమావేశం అనంతరం పార్టీ మారడం పై దేవినేని నిర్ణయానికి వచ్చారు.
ఈ రోజు సాయంత్రం సీఎం జగన్ ను దేవినేని కలిశారు. సీఎం జగన్ పార్టీ కండువాను దేవినేని అవినాష్ కు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అవినాష్ తో పాటు దేవినేని అనుచరుడు, టీడీపీ నేత కడియాల బుచ్చిబాబు కూడా వైఎస్సార్ సిపి లో చేరారు.
కాగా ఇసుక కొరత పై టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు విజయవాడలో ఈ రోజు దీక్ష చేస్తున్నారు. ఉదయం ప్రారంభమైన దీక్ష రాత్రి 8 గంటల వరకు సాగనుంది. చంద్రబాబు దీక్ష సమయంలోనే అవినాష్ పార్టీ మారడం గమనార్హం. కాగా, కృష్ణ జిల్లాలో ఇప్పటికే టిడిపి వల్లభనేని వంశి రాజినామా చేసిన విషయం తెలిసిందే. మొన్న జరిగిన ఎన్నికల్లో అవినాష్ గుడివాడ లో, వంశి గన్నవరం లో పోటీ చేశారు.