ప్రతి తండ్రి కోరుకొనేది ఏముంటుంది? తన పిల్లలు గొప్పగా చదవాలని, బాగా ఎదగాలని. కొందరికి స్తోమత ఉంటుంది. కాబట్టి మంచి స్కూల్స్, కాలేజీల్లో చదివిస్తారు. మరికొందరు తమ దగ్గర అంత ఆర్ధిక స్తోమత లేకపోయినా, కష్టపడి పిల్లలను బాగా చదిస్తారు. అలాంటి తండ్రికి కొడుకు ఇంటర్ మార్కుల్లో అదరగొడితే? ఆ ఆనందం ఎలాగ ఉంటుంది?
వికాస్ ఆరోరా ఆటో ఎక్కాడు. మాటల మధ్యలో డ్రైవర్ తన కొడుకు ఇంటర్ మార్క్ షీట్ ను ఫోన్ లో చూపించాడు. వావ్. మొత్తం 600 మార్కులకు 592 మార్కులు స్కోర్ చేశాడు. అతని తండ్రి హృదయం ఉప్పింగిపోతోంది. కొడుకు సాధించిన మార్కులకు తండ్రి చాలా గర్వపడ్డాడు. ఈ మార్క్ షీట్ ను వికాస్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
ఇంటర్ లో మొత్తం 600 మార్కులకు 592 మార్కులను స్కోర్ చేస్తే, ఏ తండ్రయినా ఆనందంతో ఎగిరిగంతేస్తాడు. కొడుకును ఎక్కడ చేర్చాలని తెగ ట్రైచేస్తాడు.
తనకున్న ఆర్ధిక పరిస్థితిలోకూ కూడా ఒక ఆటో డ్రైవర్ కొడుకును ఈస్థాయిలో చదివించాడంటే నిజంగా మెచ్చుకోవాలి. తన ఆటోలో ఎక్కే ప్యాసింజర్లకు ఈ తండ్రి గొప్పగా మార్క్ షీటును చూపిస్తున్నాడు. అంతకన్నా అతనికి కావాల్సింది ఏముంది? ఈ పోస్ట్ కు యూజర్లు చాలా పాజిటీవ్ గా రియాక్ట్ అవుతున్నారు. కొందరైతే ఆ కుర్రాడి హైయ్యర్ స్టడీస్ కి, సాయం చేయడానికి కూడా రెడీ.
79580