ఆర్టీసీ కార్మికులకు సంబంధించి ఏ ఒక్క డిమాండ్‌పై వెనక్కి తగ్గేది లేదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. సమ్మెలో భాగంగా బుధవారం దిల్‌సుఖ్ నగర్ బస్టాండ్‌లో ఆర్టీసీ ధూం ధాం కార్యక్రమంలో అశ్వత్థామరెడ్డి సహా పలు పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘విలీనంపై వెనక్కి తగ్గినట్లు ఎక్కడైనా చెప్పినట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం. ఆర్టీసీ కార్మికుల 26 డిమాండ్లపై చర్చలకు రావాలి. కార‍్మికులు, ప్రజలను ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోంది. కార్మికులను గందరగోళంలోకి నెట్టొద్దు’ అని అన్నారు.