iDreamPost
iDreamPost
ఇటీవల కేరళలో జరిగిన ఎన్నికలలో సిపిఐ (ఎం) పార్టీ తరుపున పోటీ చేసిన 21 ఏళ్ళ ఆర్య రాజేంద్రన్ తదుపరి తిరువనంతపురం మేయర్ అయ్యే అవకాశం ఉందని సిపిఐ (ఎం) వర్గాలు తెలిపాయి. ఆల్ సెయింట్స్ కళాశాలలో బిఎస్సి మ్యాథ్స్ రెండవ సంవత్సరం విద్యార్థిగా ఉన్న ఆర్య రాజేంద్రన్, తిరువనంతపురంలోని ఒక చిన్న ఇంట్లో నెలకు 6,000 రూపాయల అద్దె చెల్లిస్తు ఎలక్ట్రీషియన్ అయిన తండ్రి కె ఎం రాజేంద్రన్, ఎల్‌ఐసి ఏజెంట్ అయిన తల్లి శ్రీలత తో కలిసి ఉంటున్నారు.
చిన్నతనం నుంచి వామపక్ష భావజాలన్ని వంటపట్టించుకున్న ఆమే స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఐ) కార్యకర్తగా, వామపక్ష పార్టీ పిల్లల విభాగమైన బాలసంగం రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉంటూ ఆమే పార్టీకి ఏనలేని సేవ చేశారని ఆ సేవలను గుర్తించిన పార్టీ నాయకత్వం ఆమెకు మేయర్ పీఠం కట్టబెట్టబోతునట్టు వార్తలు వస్తున్నాయి. అమే ఎన్నికల్లో నగర కార్పొరేషన్ ముదవణ్ముఘల్ వార్డ్ నుండి 2,872 ఓట్లు సాధించి, ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి పై 549 ఓట్ల మేజారిటీతో విజయం సాదించారు.
తనని మేయర్ స్థానానికి ఎంపిక చేయబోతున్న వార్తకు సంబంధించి మీడియా ప్రతినిధులు ఆమెని అడగగా, మేయర్ స్థానంపై వస్తున్న వార్తల్లో ఇంకా పార్టీ నుండి తనకు ఎలాంటి సమాచారం లేదని , పార్టీ ఏ నిర్ణయం తీసుకున్న అది సరైన నిర్ణయమే అవుతుందని తాను భావిస్తునట్టు చెప్పుకొచ్చారు. సిపిఐ (ఎం) పార్టీ తనను మేయర్ పదవికి ఎంపిక చేస్తే అమె దేశంలో అతి చిన్న వయస్సులో మేయర్ స్థానాన్ని దక్కించుకున్న మహిళగా రికార్డు సృష్టిస్తారు.