iDreamPost
iDreamPost
గత ఆరు నెలలుగా ఓటిటి బాగా ఊపందుకోవడంతో ఆర్థిక కారణాల వల్ల థియేటర్లలో విడుదల కాలేక ఆగిపోయిన చాలా సినిమాలు డిజిటల్ లో దర్శనమిచ్చాయి. నిర్మాత సేఫ్ అవ్వడం ముఖ్యం కాబట్టి ఈ విషయంలో మంచే జరిగింది. అయితే షూటింగ్ పూర్తయిపోయి ఫస్ట్ కాపీ సిద్ధమైన సినిమా అవుట్ ఫుట్ దారుణంగా వచ్చిన కారణంతో రిలీజ్ ఆగిపోవడం అరుదుగా జరుగుతుంది. అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ ముందు బాలా డైరెక్షన్ లో ‘వర్మ’ టైటిల్ తో తీసిన సంగతి తెలిసిందే. ట్రైలర్ వచ్చాక దాని మీద విపరీతమైన నెగటివ్ కామెంట్స్ వచ్చాయి. నిర్మాతలకు కూడా షో వేసుకుని చూసి ఏంటి ఇంత దారుణంగా వచ్చిందనుకుని దాన్ని చెత్త బుట్టలో వేయాలని డిసైడ్ అయ్యారు.
కొంత గ్యాప్ తీసుకుని ఆదిత్య వర్మ పేరుతో సందీప్ వంగా అసిస్టెంట్ గిరిసాయతో మళ్ళీ ఫ్రెష్ గా ఇంకో వెర్షన్ తీశారు. ఈ చిత్రం ఇక్కడి రేంజ్ లో బ్లాక్ బస్టర్ కాలేదు కానీ విక్రమ్ కొడుకు డెబ్యూగా బాగానే పనికొచ్చింది. పెర్ఫార్మన్స్ పరంగా మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత ఆ ఆదిత్య వర్మ ఓటిటిలో కూడా వచ్చేసింది. ఇప్పుడు ఆ మూలాన పడేసిన ఫస్ట్ వెర్షన్ వర్మను ఇప్పుడు బయటికి తీసి డిజిటల్ లో వదలాలనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారు. ఇప్పటికే డీల్ ఆల్మోస్ట్ ఫిక్స్ అయ్యిందని ఇన్ సైడ్ టాక్. ఇప్పటికే ఇన్నిసార్లు చూసేసి అరిగిపోయిన సినిమాను మళ్ళీ ఇంకో రూపంలో తీసుకురావడం అంటేవిచిత్రమే. ఈ పరిణామం చియాన్ ఫ్యాన్స్ కి రుచించడం లేదు.
ఎలాగూ ఆదిత్య వర్మ చూసేశాక మళ్ళీ ఇప్పుడు బాలా వర్మను రిలీజ్ చేయడంలో ఉద్దేశం ఏమిటనేది వాళ్ళ వెర్షన్.
శివపుత్రుడు, నేనే దేవుణ్ణి లాంటి క్లాసిక్స్ ద్వారా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న బాలా తన కోణంలో అర్జున్ రెడ్డిని ఎలా చూపించి ఉంటాడా అనే ఆసక్తి అయితే అభిమానుల్లో నెలకొంది. కాకపోతే ఎంత దారుణంగా తీసుంటే అంత ఖర్చు పెట్టి తీసిన సినిమాను పక్కకు పెట్టేస్తారు. అలాంటప్పుడు ఇప్పుడు మాత్రం అది మెప్పించే అవకాశాలు ఎలా ఉంటాయి. ఏదో టైం పాస్ కి తప్ప దీని వల్ల అంతగా ఉపయోగం ఉండదు. అసలే సరైన ఓటిటి సినిమా ఇప్పటిదాకా ఏదీ ప్రేక్షకులను పూర్తి స్థాయిలో అలరించలేదు. తీసినవాళ్ళే మహా రాడ్ ని డిసైడ్ అయిన వర్మ కనక బుల్లి తెరపై వస్తే సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోల్స్ జరగడం ఖాయం. దానికోసమే పనిగట్టుకుని ఇలా విడుదల చేస్తున్నట్టు ఉందని ఫ్యాన్స్ బాధ. అందులోనూ లాజిక్ ఉంది మరి