iDreamPost
android-app
ios-app

సీఎం పై దూషణ : కటకటాల్లో తిరుపతి వాసి

సీఎం పై దూషణ : కటకటాల్లో తిరుపతి వాసి

సీఎం జగన్‌పై సోషల్‌ మీడియాలో అభ్యంతర, అసభ్యకర పదజాలంతో దూషించే పోస్టింగ్స్‌ పెట్టిన యువకుడిని సైబర్‌ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. మంగళగిరిలోని డీజీపీ కార్యాలయ సైబర్‌ క్రైం స్టేషన్‌లో 7/2019గా కేసు నమోదు చేశారు. ఈ కేసులో చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన మేదరమెట్ల సురేశ్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. మేజిస్ర్టేట్‌ రిమాండ్‌ విధించడంతో సురేశ్‌ను జైలుకు తరలించారు. సోషల్‌ మీడియాలో పోస్టింగ్స్‌ పెట్టే సందర్భంలో ప్రతి ఒక్కరు తమ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలని ఈ సందర్భంగా సీఐడీ ఎస్పీ మేరి ప్రశాంతి సూచించారు. ఇతరుల గౌరవమర్యాదలకు భంగం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేసే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.