iDreamPost
iDreamPost
ప్రకటించినప్పటి నుంచి చాలా ప్రత్యేకమైన సినిమాగా ప్రచారంలో ఉంటూ వచ్చిన దగ్గుబాటి రానా అరణ్య నిన్న థియేటర్లలో అడుగుపెట్టింది. కరోనా కేసుల వల్ల హిందీ వెర్షన్ వాయిదా పడినప్పటికీ కంటెంట్ మీద నమ్మకంతో ఎరోస్ సంస్థ తెలుగు తమిళంలో రిలీజ్ చేసేసింది. సోలో హీరోగా రానా భారీ క్రౌడ్ పుల్లర్ కాకపోయినా మౌత్ టాక్ తో ఇది పికప్ అవుతుందన్న నమ్మకం ట్రేడ్ లో ఉండేది. అందులోనూ అడవి, ఏనుగులు లాంటి బ్యాక్ డ్రాప్ సెట్ చేయడంతో పెద్దలతో పాటు పిల్లలకు కూడా నచ్చుతుందనే అభిప్రాయం కలిగింది. అయితే ప్రివ్యూల నుంచే డివైడ్ టాక్ అందుకున్న అరణ్య మొదటి రోజు డల్ గానే మొదలుపెట్టింది.
ట్రేడ్ నుంచి వస్తున్న న్యూస్ మేరకు అరణ్య మొదటి రోజు కేవలం 2 కోట్ల పై చిలుకు షేర్ మాత్రమే రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో కోటిన్నర కూడా దాటలేకపోవడం విచారకరం. ఉన్నంతలో నైజామ్ లోనే కాస్త మెరుగ్గా కనిపించింది. అటువైపు రంగ్ దే కు బ్లాక్ బస్టర్ రిపోర్ట్ ఏమి రాకపోయినా దాని డామినేషన్ స్పష్టంగా కనిపించింది. అందుకే ఈ వీక్ ఎండ్ దాని కన్నా అరణ్యకే కీలకంగా మారుతోంది. వచ్చే శుక్రవారం మరిన్ని సినిమాలు రానున్న నేపథ్యంలో ఈ రెండు రోజులు చాలా కీలకంగా మారబోతున్నాయి. అయితే అసలు వెర్షన్ ని ఎడిటింగ్ చేసి రెండు గంటల పది నిమిషాలకు కుదించినా లాభం లేకపోయింది. ఇక లెక్కల సంగతి చూద్దాం
– ఏరియా వారీగా అరణ్య మొదటి రోజు ఆంధ్ర తెలంగాణ కలెక్షన్స్
AREA | SHARE |
నైజాం | 0.43cr |
సీడెడ్ | 0.18cr |
ఉత్తరాంధ్ర | 0.19cr |
గుంటూరు | 0.23cr |
క్రిష్ణ | 0.081cr |
ఈస్ట్ గోదావరి | 0.09cr |
వెస్ట్ గోదావరి | 0.10cr |
నెల్లూరు | 0.06cr |
Total Ap/Tg | 1.37cr |
రెస్ట్ అఫ్ ఇండియా | 0.61cr |
ఓవర్సీస్ | 0.10cr |
ప్రపంచవ్యాప్తంగా | 2.10cr |
దీన్ని గ్రాస్ లెక్కలో చూసుకుంటే మూడు కోట్ల అరవై ఆరు లక్షల దాకా వస్తుంది. ఏదేమైనా రానా ఇంకా గట్టిగా పోరాడాల్సి ఉంది. ముఖ్యంగా పబ్లిక్ టాక్, రివ్యూలు అరణ్యకు అనుకూలంగా రాకపోవడం మైనస్ గా మారుతోంది. దర్శకుడు ప్రభు సాల్మన్ తీసుకున్న సబ్జెక్టు మంచిదే అయినప్పటికీ ప్రెజెంటేషన్ లో జరిగిన తడబాటు వల్ల రానా అద్భుత నటన అందరికీ చేరడం లేదని అభిమానులు వాపోతున్నారు. సో శని ఆదివారాలు అరణ్యకు చాలా కీలకం కాబోతున్నాయి. తెలుగు వెర్షన్ వరకు బ్రేక్ ఈవెన్ చేరుకోవాలన్నా సుమారు 15 కోట్ల వసూలు చేయాల్సిన ఈ ఫారెస్ట్ థ్రిల్లర్ ఫైనల్ గా టార్గెట్ చేరుకోవడం కష్టంగానే కనిపిస్తోంది