iDreamPost
android-app
ios-app

కరోనాపై పోరుకు ఏపీలో సంజీవని వాహనాలు

కరోనాపై పోరుకు ఏపీలో సంజీవని వాహనాలు

కరోనా వైరస్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా పరీక్షలు చేయడంలో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ఈ దిశగా మరో అడుగు ముందుకు వేసింది. వైరస్‌ కట్టడికి గరీష్టంగా పరీక్షలు చేయడమే ఉన్న ఏకైక మార్గమని నిపుణుల సూచన మేరకు ఏపీ ప్రభుత్వం ఆది నుంచి నిర్థారణ పరీక్షలపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రతి జిల్లాలో వైరాలజీ ల్యాబులు ఏర్పాటు చేయడంతోపాటు మెబైల్‌ ల్యాబులు కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. వైరస్‌ వ్యాప్తి ఇంకా పెరుగుతుందన్న హెచ్చరికల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది.

పరీక్షలు చేసేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు సమకూర్చుకోవడంపై దృష్టి పెట్టింది. అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు చర్యలు చేపట్టింది. పట్టణాలు లేదా గ్రామాల్లో ఎవరికైనా వైరస్‌ సోకినట్లు గుర్తిస్తే.. ఆ ప్రాంతంలో ఇంటికి ఒకరికి చొప్పన వైరస్‌ నిర్థారణ పరీక్షలు చేస్తున్నారు. ఇప్పటి వరకూ సాంపిల్‌ ఇచ్చేందుకు ప్రజలు సమీపంలోని ప్రాథమిక వైద్యశాలకు వెళుతున్నారు. ఇకపై వారు ఉన్న ప్రాంతంలో శాంపిల్స్‌ తీసుకునేందుకు అవసరమైన ఏర్పాట్లను ప్రభుత్వం చేస్తోంది. ఇందులో భాగంగా ఆర్టీసీ బస్సులను కరోనా పరీక్షలు చేసేందుకు అనువుగా మార్చింది.

ఆర్టీసీ నడిపే ఇంద్ర బస్సులను కరోనా పరీక్షలు చేసేందుకు వీలుగా మార్పులు చేశారు. ప్రతి జిల్లాకు నాలుగు బస్సుల చొప్పున 13 జిల్లాలకు 52 బస్సులను ఆర్టీసీ సిద్ధం చేసింది. ఈ బస్సులను ఈ రోజు ప్రారంభించనున్నారు. కరోనా కట్టడి నియంత్రణ చర్యల్లో ఈ బస్సులు సేవలు అందించనున్నాయి. ఇకపై ఈ బస్సుల ద్వారా వైరస్‌ వెలుగచూసినా ప్రాంతాల్లోని ప్రజల నుంచి శ్వాబ్‌ సాంపిల్స్‌ను సేకరించనున్నారు.