Idream media
Idream media
ఏపీఎస్ఆర్టీసీ కార్మికుల దశాబ్ధాల కల నెరవేరింది. కార్మికులందరూ జనవరి 1 నుంచి ప్రభుత్వ ఉద్యోగులేనని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రకటించారు. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం బిల్లును సోమవారం శాసనసభ ఆమోదించింది. ఆర్టీసీలోని 52వేలమంది కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగుల విలీన కార్యక్రమాన్ని చిరునవ్వుతో స్వాగతిస్తుని జగన్ అన్నారు. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్న ఐదేళ్లలో వారిని పట్టించుకోలేదని ఇప్పుడు టీడీపీనేతలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని జగన్ అన్నారు. ప్రధాన బిల్లులపై చర్చ జరుగుతున్నా చంద్రబాబు సభలో లేకుండా వెళ్లిపోయారని జగన్ విమర్శించారు.
జగన్ అసెంబ్లీలో మాట్లాడుతూ ఇట్లాంటి వాళ్లను చూసినప్పుడు అర్ధం లేకుండా పోయిందనిపిస్తుంది. విలువలతో, విశ్వసనీయతతో కూడినదే రాజకీయం అంటారని, కానీ వీళ్ల మాటలు, వీళ్ల పరిస్దితులు చూసినప్పుడూ రాజకీయాలు ఏ మేరకు దిగజారిపోయాయో అని చెప్పి బాధనిపిస్తోందన్నారు. ఈ బిల్లు ఎందుకు ప్రవేశపెట్టాల్సి వస్తుందన్నది అందరూ కూడా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కారణమేంటంటే 1997లో అప్పట్లో చంద్రబాబు గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఒక బిల్లు తీసుకొచ్చారు. ఆ బిల్లు ఏం చెపుతుందంటే ఆ బిల్లు ప్రభుత్వ రంగ సంస్ధల్లో ఉన్న ఏ ఒక్క ఎంప్లాయీ, ఏ ఒక్కరూ కూడా, ప్రభుత్వంలోకి విలీనం కావడానికి వీలు లేదు, వీలు కాకుండా ఉండేందుకు ఒక బిల్లును 1997లో చంద్రబాబునాయుడు గారు తీసుకొచ్చారని గుర్తు చేశారు. అంతటి దారుణంగా అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్ధితుల్లోనూ విలీనం చేసే పరిస్థితి రానే రాకూడదు అని, అప్పట్లో అడ్డుకునేందుకే 1997లో ఆయన తెచ్చిన బిల్లు ఉందన్నారు. ఇవాళ కొత్తగా విలీనం చేసేందుకు ఇంకో బిల్లు తీసుకురావాల్సిన అవసరం ఉందని, కాబట్టి ఇవాళ మళ్లీ చారిత్రాత్మకమైన బిల్లును ప్రవేశపెడతా ఉన్నామన్నారు.
దాదాపుగా 52వేల మంది ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్ధలో ఉన్న వీళ్లంతా కూడా ప్రభుత్వంలోకి విలీనం అవుతారని చెప్పారు. ఏ రకంగా అయితే ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ ఉందో, ఏ రకంగా అయితే హోం డిపార్ట్‌మెంట్ ఉందో, ఏ రకంగా అయితే సివిల్ సఫ్లైస్ డిపార్ట్ మెంట్ ఉందో, ఏ రకంగా అయితే మున్సిపాల్టీ డిపార్ట్‌మెంట్ ఉందో, ఏ రకంగా అయితే పంచాయితీ రాజ్ డిపార్ట్‌మెంట్ ఉందో, అలా ఏ రకంగా అయితే డిఫరెంట్, డిఫరెంట్ డిపార్ట్‌మెంట్స్ ఉన్నాయో అదే విధంగా ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్‌మెంట్ కింద వీళ్లందరినీ కూడా తీసుకోవడం జరుగుతా ఉందని స్పష్టం చేశారు. దీని వల్ల 52వేల మంది ఉద్యోగులకు మేలు జరుగుతుందని చెప్పారు. ఈ కార్పోరేషన్‌లో ఇంతకముందు 58 సంవత్సరాల రిటైర్మెంట్ వయస్సు ఉంటే, ఆ 58 యేళ్ల వయస్సు వాళ్లు కూడా అప్పట్లో కాళ్లా, వేళ్లా పడ్డారు. మిగతావాళ్ల కూడా 60 యేళ్లు వయస్సు మాక్కూడా ఇప్పించండనిని వేడుకున్నారు. మా జీవితాలు కూడా బాగుపడతాయి, మేం కూడా ప్రభుత్వ రంగ సంస్ధలోనే ఉన్నాం కదా, మాక్కూడా రిటైర్మెంట్ వయస్సు పెంచండి అని అంటే ఏమాత్రం కూడా చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో పట్టించుకోలేదని జగన్ గుర్తు చేశారు.
అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్లు అడక్కపోయినా కూడా మిగిలిన ఎంప్లాయిస్ ఎవరైతే ప్రభుత్వ రంగ సంస్ధల్లో ఉన్నారో రిటైర్మెంట్ వయస్సు 60 సంవత్సరాలు ఉండేట్టుగా వీరికి కూడా 60 ఏళ్లు వర్తించేటట్టుగా ముందుగానే ఆదేశాలు జారీ చేశామని ఆ తర్వాతే విలీన ప్రక్రియ మొదలుపెట్టామన్నారు. విలీన ప్రక్రియ ఏ రకంగా జరుతా ఉందో ఇంతకముందు రవాణాశాఖమంత్రి పేర్ని నాని డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసిన విషయం చెప్పారు. జనవరి 1 తారీఖు నుంచి వీళ్లంతా కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా చలామణీ అవుతారని చెప్పారు. దానికోసమే ఇవాళ ఈ బిల్లు తీసుకొస్తా ఉన్నామన్నారు. దీనివల్ల దాదాపు రూ.3600 కోట్లు శాలరీస్ రూపంలో ప్రభుత్వం బర్డెన్ తీసుకుంది, చిరునవ్వుతో ఈ కార్యక్రమాన్ని చేస్తామన్నారు. చివరగా ఎంప్లాయిస్ జీవితాల్లో వెలుగులు నింపాలని, వారందరికీ ఈరోజు పండగ దినంకావాలన్న ముఖ్యమంత్రి వారందరికీ మంచి జరగాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానన్నారు. జగన్ నిర్ణయం పట్ల సభలోని సభ్యులంతా హర్షం వ్యక్తం చేస్తూ అభినందలు తెలిపారు.