వివిధ పోస్టుల భర్తీకి అక్టోబర్, నవంబర్ నెలల్లో నిర్వహించాల్సిన మెయిన్స్ పరీక్షలను వాయిదా వేసినట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పాలనాపరమైన కారణాల వల్ల వీటిని వాయిదా వేస్తున్నట్లు వివరించారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, గెజిటెడ్ పోస్టులు, పాలిటెక్నిక్ లెక్చరర్లు, నాన్ గెజిటెడ్ పోస్టులు, డిగ్రీ కాలేజీ లెక్చరర్ పోస్టులకు సంబంధించిన పరీక్షలు జరగాల్సి ఉంది. కాగా, ఈ పరీక్షలు నిర్వహించే తేదీలను ఈనెల 22న ప్రకటిస్తామన్నారు.