కేంద్ర ప్రభుత్వం ఏపీకి గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీ ప్రభుత్వం అదనపు రుణాన్ని పొందడానికి అనుమతి ఇచ్చింది.
జగన్ సర్కార్ కు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. కేంద్ర ఫైనాన్స్ శాఖ ఏపీ ప్రభుత్వానికి అదనపు రుణం పొందటానికి అనుమతినిచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సంస్కరణలను విజయవంతంగా అమలు చేసినందుకు గాను అదనపు రుణం తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ వెసులుబాటు కల్పించింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో కేంద్రం తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో అగ్రస్థానం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ పథకాలకు పారదర్శకత ఉండాలనే ఉద్దేశంతో కేంద్రం కొన్ని ప్రతిపాదనలను రాష్ట్రాలకు సూచించింది. విభజనతో నష్టపోయిన రాష్ట్రానికి కేంద్రం చేయూత అవసరమనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం అందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. దీంతో కేంద్ర ఫైనాన్స్ శాఖ ఏపీ ప్రభుత్వానికి అదనపు రుణం పొందటానికి అనుమతినిచ్చింది.
ప్రభుత్వానికి వరం
కరోనా మహమ్మారి దెబ్బకు దాదాపు అన్నీ రంగాలు కుదేలయ్యాయి. దీంతో ఆయా రంగాల నుంచి ప్రభుత్వానికి రావలసినంత ఆదాయం ప్రభుత్వానికి రావడం లేదు. సంక్షేమ పథకాలకు, ప్రభుత్వ కార్యక్రమాలకు నిధులు లేక ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటుంది. ఈ నేపథ్యంలో మోడీ ప్రభుత్వం ఇచ్చిన ఈ అనుమతులు ఏపీ ప్రభుత్వానికి వరమని చర్చ జరుగుతోంది. ఇటీవలే కేంద్రం పోలవరానికి సంబందించిన నిధులను కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే. వీటితో బాటు ఏపీకి రావాల్సిన నిధుల కోసం కేంద్రాన్ని డిమాండ్ చేయాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు.
5న మోడీతో భేటీ
శుభవార్త నేపథ్యంలోనే జగన్ ఢిల్లీ పర్యటన ఖరారైంది. ఈ పర్యటనలో ప్రధాని మోడీతో జగన్ భేటీ కానున్నారు. అదనపు రుణం, పోలవరం నిధులను విడుదల చేసినందుకు జగన్ ప్రధానికి ధన్యవాదాలు చెప్పనున్నారని వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. ఇదే సమయంలో ఏపీకి రావాల్సిన నిధుల కోసం ప్రధానితో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ పర్యటనలో జగన్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో కూడా భేటీ కానున్నారని సమాచారం. వారం వ్యవధిలో జగన్ ఢిల్లీ పర్యటన మరోమారు ఖరారు కావడం రాజకీయ వర్గాలలో చర్చకు దారి తీసింది. ఈ భేటీలో ప్రభుత్వంలో చేరమని జగన్ ను ప్రధాని కోరనున్నట్లు వార్తలు వినబడుతున్నాయి. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు జగన్ ఎన్డీఏ ప్రభుత్వంలో చేరబోవడం లేదని సమాచారం. బయటి నుంచి మద్దతు మాత్రమే తెలపాలని ప్రభుత్వంలో చేరకూడదని జగన్ నిర్ణయం